Mahesh Babu - SitaraMahesh Babu - Sitaraప్రిన్స్ మహేష్ బాబు ను అభిమానులకు సరికొత్తగా పరిచయం చేసే కార్యక్రమంలో సతీమణి నమ్రత ఉన్నట్లుగా కనపడుతోంది. ఫ్యామిలీతో కలిసి మహేష్ ట్రిప్ లు వేయడం, గౌతమ్, సితారలతో కలిసి ఎంజాయ్ చేయడం వంటివి పిక్స్ రూపంలో వస్తూనే ఉంటాయి. అయితే ఆ ఎంజాయ్మెంట్ ఏ స్థాయిలో ఉంటుందనే విషయాన్ని స్పష్టత ఇస్తోంది నమ్రత.

ఆదివారం నాడు పోస్ట్ చేసిన మహేష్ – సితారలే వీడియోనే ఇందుకు నిదర్శనం. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మహేష్ – సితారలిద్దరూ నవ్విన వీడియో వీక్షకులకు చూడముచ్చటగా ఉంది. ఎంత స్టార్ హీరో అయినా, తన పిల్లలకు తండ్రే కదా… అనిపించే విధంగా ఉన్న ఈ వీడియోను చూస్తూ మురిసిపోవడం మహేష్ బాబు అభిమానుల వంతవుతోంది.