Mahesh Babu OTT Platform businessకరోనావైరస్ లాక్డౌన్ కారణంగా చిత్ర, టెలివిజన్ పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతినడంతో డిజిటల్ సినిమా యాప్లు (ఓటీటీ) ఎంటర్టైన్మెంట్ రంగాన్ని ఏలుతున్నాయి. ఈ సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఓటీటీ బిజినెస్ లోకి ఎంటర్ అవుతారని వార్తలు వస్తున్నాయి. కానీ అలాంటి ప్రణాళిక లేదని సూపర్‌స్టార్‌కు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

మహేష్ బాబు అలాంటి ఆలోచన కూడా చేయలేదని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. “ప్రస్తుతానికి, మహేష్ బాబుకు ఏఎంబీ సినిమాస్ మరియు ఫిల్మ్ ప్రొడక్షన్ లో మాత్రమే పెట్టుబడులు ఉన్నాయి. ఓటీటీ బిజినెస్ లోకి ఎంటరై అల్లు అరవింద్ గారు దెబ్బ తినే పరిస్థితి ఈ తరుణంలో ఎవరూ అటువైపు చూసే అవకాశం లేదు” అని అంటున్నారు.

మహేష్ బాబు తన తదుపరి ప్రాజెక్ట్ కోసం గీతా గోవిందం ఫేమ్ పరశురాంతో జతకట్టనున్నారు. ఈ చిత్రం మే 31 న సూపర్ స్టార్ కృష్ణ బర్త్‌డే స్పెషల్‌ గా ముహూర్తం జరపాలని నిర్మాతలు అనుకుంటున్నారు. అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం జూన్ లేదా జూలై నుండి ప్రారంభమవుతుంది. 2021 సమ్మర్ కు సినిమా విడుదలను ప్లాన్ చేస్తున్నారు.

మహేష్ బాబు ప్రస్తుతం లాంగ్ బ్రేక్ తీసుకున్నారు. సహజంగా ఆయన సమ్మర్ లో కుటుంబ సభ్యులతో ఏదైనా ఫారిన్ దేశానికీ వెళ్లి వస్తారు. అయితే ఈ సారి మాత్రం కరోనా లాక్డౌన్ కారణంగా హైదరాబాద్ కే పరిమితం అయ్యారు. అయితే ఈ బ్రేక్ వల్ల పరశురాం కు స్క్రిప్ట్ పై బాగా శ్రద్ద పెట్టే అవకాశం దక్కింది.