Mahesh Babu new businessతెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీతో మంచి బిజినెస్ మైండ్ ఉన్న హీరోలు అంటే నాగార్జున, మహేష్ బాబులే. నాగార్జున లిమిటెడ్ గా బిజినెస్ చేస్తూ ఉంటే మహేష్ బాబు మాత్రం నిత్యం కొత్త వాటిని ట్రై చేస్తూనే ఉంటాడు. మహేశ్‌బాబు ఇటీవల గచ్చిబౌలిలో విలాసవంతమైన ‘ఏఎమ్‌బీ’ సినిమాస్‌ పేరుతో ఓ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు ఆయన త్వరలో సొంతంగా దుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

‘మిమ్మల్ని ఉత్సుకతకు గురి చేసే విషయాన్ని పంచుకుంటున్నాం. ప్రస్తుతం మేం దీని పనిలోనే ఉన్నాం. సీక్రెట్‌ను బయటపెట్టేందుకు ఈ లింక్‌ను క్లిక్‌ చేయండి’ అంటూ http://www.spoyl.in/mahesh-babu అనే వెబ్‌సైట్‌ను మహేశ్‌ బాబు టీం ట్విట్టర్ లో పోస్ట్‌ చేసింది. దీన్ని మహేష్ బాబు తిరిగి షేర్‌ చేశారు. ఇందులో మూడు రోజులు కౌంట్‌డౌన్‌ ఉంచారు. ఈ పేజ్‌లోని టాబ్స్ లో దుస్తుల రకాలు, బ్రాండ్‌లు ఉంచారు. దీన్ని బట్టి మరో మూడు రోజుల్లో ఈ ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. మరి అందులో ఎలాంటివి విక్రయానికి ఉంచుతారో చూడాలి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

టాలీవుడ్ హప్పెనింగ్ హీరో విజయ్ దేవరకొండ ఇప్పటికే ‘రౌడీ’ పేరుతో సొంత దుస్తుల బ్రాండ్‌ను నడుపుతున్నారు. బాలీవుడ్‌లో హృతిక్‌ రోషన్‌, సోనమ్‌ కపూర్‌, అనుష్క శర్మ, దీపికా పదుకొణె, సన్నీ లియోని తదితరులు సొంతంగా దుస్తులు, యాక్సెసెరీస్ బ్రాండ్లను నడుపుతున్నారు. మరి మహేష్ బాబు ఈ కొత్త బిజినెస్ లో సక్సెస్ అవుతారో లేదో చూడాలి. ఇది ఇలా ఉండగా మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరూ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల అవుతుంది.