Mahesh Babu one day chief ministerతెలుగు సినిమా ఇండస్ట్రీలో వ్యక్తి పూజ చాలా ఎక్కువ. అసలు ఒక హీరోని ఇంత ఆరాధిస్తారా అనిపించేలా ఉంటుంది మన స్టార్ హీరోస్ మీద పిచ్చి. దాదాపుగా తమ ఫేవరెట్ హీరోలను దేవుళ్లుగా పూజిస్తారు చాలా మంది. కొంతమందైతే తమ జీవితాన్నే వదిలేసి వారి ఆరాధనలో మునిగిపోతారు. చాలా మంది తమ హీరోలు రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు.

రాజకీయాలు అంటే కనీసం ముఖ్యమంత్రి పీఠానికి తక్కువ కాకుండా ఊహించుకుంటారు. మహేష్ బాబు అభిమానులు కూడా చాలా మంది అలానే అనుకోవడం విచిత్రం ఏమీ కాదు. పైగా మహేష్ అనేక చారిటీ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు దానితో ఆయన రాజకీయాలలోకి వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని ఆయన అభిమానులు అంటూ ఉంటారు.

అయితే మహేష్ మాత్రం వారిని ఎప్పుడు నిరాశపరుస్తూనే ఉంటారు. తమకు అసలు రాజకీయాలు అర్ధం కావని చెప్తూ ఉంటారు ఆయన. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మహేష్ అటువంటి ఒక ప్రశ్నకు ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. మీరు ఒక రోజు సీఎం అయితే, మొదటిగా చేసే పని ఏంటి? అని అడిగారు.

దానికి మహేష్ నవ్వుతూ… నాకూ తెలియదు. దేవుడే రాష్ట్రాన్ని రక్షించాలి అని చెప్పేశారు. దీనితో అభిమానులు మరొకసారి నిరాశపడ్డారు. ఇది ఇలా ఉండగా సరిలేరు నీకెవ్వరూ తో తన కేరీర్ బెస్ట్ హిట్ సాధించిన మహేష్ బాబు కొంత కాలం లాంగ్ బ్రేక్ తీసుకున్నారు. తన తరువాతి సినిమా మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లితో చెయ్యనున్నారు.