Mahesh babu on the sets of Spyderప్రిన్స్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న “స్పైడర్” సినిమా ఫస్ట్ టీజర్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. దీంతో సోషల్ మీడియాలో అభిమానుల హంగామా ప్రారంభమైంది. వీరి జోష్ ను మరింతగా పెంచేందుకు చిత్ర యూనిట్ వర్కింగ్ స్టిల్స్ ను కూడా విడుదల చేస్తోంది. అందులో భాగంగా దర్శకుడు మురుగదాస్ కు ప్రిన్స్ ఏదో చెప్తున్నట్లుగా తొలుత విడుదల చేసిన స్టిల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇంతకీ… మురుగదాస్ కు మహేష్ ఏం చెప్పారో తెలుసా..! మే 31వ తేదీన సాయంత్రం అయిదు గంటలకు టీజర్ ను విడుదల చేస్తామని మాటిచ్చాం… ఎలాంటి ఆలస్యం లేకుండా ఖచ్చితంగా చెప్పిన సమయానికల్లా టీజర్ విడుదల కావాలి అని మురుగదాస్ కు మహేష్ చెప్తున్నట్లుగా ఈ స్టిల్ కనపడుతోంది. అవును… అభిమానుల దృష్టిలో ప్రిన్స్ అదే విషయాన్ని దర్శకుడికి గుర్తు చేస్తున్నారు. కాదంటారా..!