Mahesh Babu Response Janatha Garage, Mahesh Babu Response NTR Janatha Garage, Mahesh Babu Watched Janatha Garage, Mahesh Babu Praises NTR Janatha Garageఎలాంటి ఈగో, మొహమాటాలకు తావు లేకుండా తనకు నచ్చిన చిత్రాలకు అభినందనలు తెలిపే ప్రిన్స్ మహేష్ బాబు, తాజాగా ‘జనతా గ్యారేజ్’ సినిమా చూసి అభినందనలు తెలిపినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా దర్శకుడు కొరటాల శివతో ఇప్పటికే ప్రిన్స్ ‘శ్రీమంతుడు’ సినిమా చేయగా, మరో సినిమా జనవరి నుండి పట్టాలెక్కనుంది. ఈ నేపధ్యంలో ప్రస్తుతం ధియేటర్లలో సందడి చేస్తోన్న కొరటాల ‘జనతా గ్యారేజ్’ సినిమా చూసిన ప్రిన్స్, ఫోన్ చేసి అభినందనలు తెలిపారట.

“జనతా గ్యారేజ్ కధను డీల్ చేసిన విధానం బాగుందని, స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది” అంటూ కొరటాలను ప్రశంసలతో ముంచెత్తారట. ఇటు అభినందనలు, అటు కలెక్షన్ల వర్షంలో తడిసి ముద్దవుతోన్న కొరటాల శివకు ప్రిన్స్ మాటలు మరింత ఎనర్జీని ఇచ్చి ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ సినిమా విజయాన్ని తానూ ఎంజాయ్ చేయాలనుకుంటున్నానని, కొన్నాళ్ళ పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ మహేష్ సినిమాకు సంబంధించిన వర్క్ ను ప్రారంభిస్తానని కొరటాల ఇప్పటికే ఓ స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే.