Mahesh Babu - Rajamouliదాదాపుగా మూడు, నాలుగేళ్ల క్రితం నుండి హల్చల్ చేస్తోన్న రాజమౌళి – మహేష్ బాబు కాంభినేషన్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా? అని ప్రిన్స్ అభిమానులు నిరీక్షిస్తున్నారు. అయితే అంతకంతకూ ఈ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్తుండడం బహిరంగమే. నేడు తారక్ – చెర్రీలతో ప్రారంభమైన మల్టీస్టారర్ ముగించుకుని విడుదల కావడానికి కనీసం రెండేళ్ళ సమయమైనా పడుతుంది.

అంటే రాజమౌళి సినిమా విడుదల కావాలంటే 2020 వరకు వేచిచూడాల్సిందే. ఆ తర్వాతే జక్కన్న నెక్స్ట్ సినిమా గురించి చర్చించేది. అయితే రాజమౌళి తదుపరి సినిమా మహేష్ బాబుతోనే అని ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ప్రచురితం చేయడం హైలైట్ అయ్యింది. వీరిద్దరూ కలిసి చేసే ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యిందని, చిత్ర పాయింట్ పై ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా ఈ వార్త సారాంశం.

నిజమే… రాజమౌళి నెక్స్ట్ మూవీ ఖచ్చితంగా మహేష్ తోనే చేయడానికి ఓ లాజిక్ కూడా ఉంది. తాను డివివి దానయ్యకు, దుర్గా ఆర్ట్స్ అధినేతకు ఓ సినిమాకు కమిట్ అయ్యానని, ఈ రెండు ముగిసిన తర్వాతే ఇతర సంస్థలలో సినిమాలు చేస్తానని రాజమౌళి గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అనుకున్నట్లుగానే ఇపుడు డివివి దానయ్య సినిమా చేస్తున్నారు గనుక, లాజిక్ నెక్స్ట్ మూవీ కే.ఎల్.నారాయణకే గనుక, మహేష్ మూవీ పక్కా అన్నది బల్లగుద్ది చెప్తోన్న విషయం.