mahesh-babu-murugadoss-movie-updatesమురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న షూటింగ్ తాజాగా హైదరాబాద్ లో జరుగుతోంది. చెన్నై భారీ షెడ్యూల్ అనంతరం ప్రారంభమైన ఈ షెడ్యూల్ కూడా భారీగానే ఉంటుందని టాక్. అయితే ఇప్పటివరకు అధికారికంగా ఏ ఒక్క ఫోటో విడుదల కాని, ఈ సినిమా స్టిల్స్ లో భాగంగా మరికొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అభిమానులతో దిగిన స్టిల్ ఒకటి ఉండగా, మరో రెండు ప్రిన్స్ కు సంబంధించినవి. ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఒకటి ఉండగా, మరొకటి ఏదో అడుగుతున్నట్లుగా ఉంది. సింపుల్ గానే కనపడుతున్నా… ప్రిన్స్ స్థాయికి తగిన విధంగా ఓ రేంజ్ లో హల్చల్ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్ ను మురుగదాస్ దీపావళి కానుకగా అక్టోబర్ 29వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.