Mahesh Babu Movie Title, Murugadoss Mahesh Babu Movie Title, Mahesh Babu Movie Title Vasco Da Gama, Mahesh Babu Movie Title Confirmed, Mahesh Movie Titleతమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటించబోయే సినిమాలో ఎలాంటి పాత్ర పోషిస్తాడనే విషయంపై రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వీటిపై ఓ స్పష్టత రాలేదు గానీ, తాజాగా ఈ సినిమా టైటిల్ కు సంబంధించి మరో వార్త హైలైట్ అవుతోంది. 1498లో సముద్ర మార్గాన్ని కనిపెట్టి హిందూదేశం అని పేరు పెట్టిన ‘వాస్కోడిగామ’ అనే పేరునే సినిమా టైటిల్ గా నిర్ణయించారని సినీ వర్గాల టాక్.

గతంలో ‘చట్టంతో పోరాటం, ఎనిమీ’ వంటి టైటిల్స్ కూడా హల్చల్ చేసి, ఆ తర్వాత మసకబారాయి. మరి ఈ ‘వాస్కోడిగామ’ విషయంలోనైనా నిజమవుతుందో లేక కాలగర్భంలో కలిసిపోతుందో చూడాలి. అయితే మునుపటి టైటిల్స్ తో పోలిస్తే… ఈ ‘వాస్కోడిగామ’ టైటిల్ పట్ల అభిమానులు, సినీ ప్రేక్షకులు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇదే టైటిల్ నిజమైతే మహేష్ బాబు చేత మురుగదాస్ ఏం కనిపెట్టిస్తాడో..? అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.

న్యాయవ్యవస్థలో ఉన్న లోపాలను కనిపెడతాడా? సీక్రెట్ ఏజెంట్ గా స్టింగ్ ఆపరేషన్లు చేసి ఇంకేదైనా కనిపెడతాడా? అంటూ ‘వాస్కోడిగామ’ టైటిల్ పై ఆసక్తికర చర్చకు తెరలేపారు. అయితే దీనిపై స్పష్టత ఇవ్వాల్సింది చిత్ర యూనిట్ సభ్యులే కావడంతో, అధికారిక ప్రకటన వరకు వేచియుండడమే అభిమానుల వంతు. జూలై 15వ తేదీ నుండి ఈ సినిమా తన రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకోనున్న విషయం తెలిసిందే.