Mahesh Babu Murugadoss Movie Still, Mahesh Babu Murugadoss Movie Still Leaked, Mahesh Babu Murugadoss Movie First Look, Mahesh Babu Movie Leaked Photosప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న మురుగదాస్ – మహేష్ మూవీకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఫోటోలు విడుదల కాలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం లీక్ ల పర్వం ఈ సినిమాకు కూడా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రిన్స్ కు సంబంధించిన కొన్ని స్టిల్స్ మరియు బైక్ పై హీరోయిన్ ను ఎక్కించుకునే కొన్ని సెకన్ల వీడియో లీక్ కాగా, తాజాగా ప్రిన్స్ సరికొత్త లుక్ లో దర్శనమిస్తున్నారు.

సింపుల్ కాస్ట్యూమ్స్ లో టక్ చేసుకుని ఉన్న ప్రిన్స్ లుక్ అభిమానులను మెప్పిస్తోంది. గత సినిమాలలో ప్రిన్స్ ఇన్ షర్ట్ వేసుకున్న స్టిల్స్ బహు అరుదు. ఇటీవల కాలంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో ఇంటర్వ్యూకు వెళ్ళే ఓ సన్నివేశంలో మాత్రమే కొన్ని సెకన్ల పాటు ఇలా టక్ వేసుకుని కనపడ్డారు ప్రిన్స్. అలాగే అంతకు ముందు ‘వంశీ, రాజకుమారుడు’ సినిమాలలో కొన్ని సెకన్ల పాటు దర్శనమిచ్చిన మహేష్ లుక్, ప్రస్తుతం కొత్తగా ఉంది.

అంతగా నాణ్యత లేని ఈ ఫోటోలో ‘మహేష్ ఏంటి… ఇలా ఉన్నాడు’ అని అనిపిస్తున్నప్పటికీ, హెచ్.డి ఫోటోలలో అరిపించేయడం గ్యారెంటీ అంటున్నారు అభిమాన వర్గం. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న విషయాన్ని ఇటీవలే దర్శకుడు మురుగదాస్ ఖరారు చేసారు. అన్ని హంగులు ముగించుకుని, 2017 సమ్మర్లో తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధమవనుంది ఈ సినిమా.