Mahesh Babu maniratnam movieసూపర్ స్టార్ మహేష్ బాబు సెన్సషనల్ సీనియర్ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుందని చాలా ఏళ్లగా వినిపిస్తుంది. మణిరత్నం ప్రస్తుతం చేస్తున్న పొన్నియన్ సెల్వన్ చిత్రంలో మహేష్ బాబు హీరో అని అప్పట్లో బలంగా వార్తలు వినిపించాయి. అయితే అది జరగలేదు. రెండు సందర్భాలలోనూ ఆయన మంచి స్క్రిప్ట్ తో మహేష్ ను ఇంప్రెస్ చేయలేకపోయారు.

అయితే మహేష్ ఎప్పుడూ మణిరత్నం అంటే ఎంతో గౌరవం చూపిస్తూనే ఉంటాడు. ఈరోజు మణిరత్నం పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు ట్విట్టర్లో ఆయనకు విష్ చేశాడు. బహుశా తెలుగు స్టార్ హీరోలలో మణిరత్నం ను అంతగా అభిమానించే స్టార్ ఇంకొకరు ఉండరేమో. అయితే మహేష్ మాత్రం స్క్రిప్ట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వడు.

ఒకప్పుడు ఎన్నో క్లాసిక్ సినిమాలు తీసిన మణిరత్నం గత కొంత కాలంలో తన స్థాయి సినిమాలు ఇవ్వలేకపోతున్నారు. ఇటువంటి తరుణంలో మహేష్ బాబుతో సినిమా ఎప్పటికీ జరగకపోవచ్చు. అయితే మహేష్ బాబు – మణిరత్నం ఉమ్మడి అభిమానులు మాత్రం ఈ కాంబినేషన్ లో సినిమా కోసం ఎంతగానో వేచి చూస్తున్నారు.

అయితే ఓన్లీ మహేష్ అభిమానులు మాత్రం మణిరత్నం ఉన్న ఫామ్ కారణంగా పెద్దగా ఆసక్తిగా లేరు. అయితే సినిమాలలో, రాజకీయాలలో అలాగే జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. రేపు పొన్నియన్ సెల్వన్ అనే సినిమా పెద్ద హిట్ అయితే ఇప్పుడున్న ఈక్వేషన్లు అన్నీ మారిపోవచ్చు… ఆ సినిమా జరగనూవచ్చు. ఏమో గుర్రం ఎగరావచ్చు అంటారు కదా!