Mahesh Babu Maharshi Leaked picsప్రిన్స్ మహేష్ బాబు కెరీర్ లో 25వ సినిమా తెరకెక్కుతోన్న “మహర్షి” సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం యుఎస్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా, వీటికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియా లో లీక్ అవ్వడం చిత్ర యూనిట్ సభ్యులను నిరాశకు గురిచేస్తోంది.

‘మహర్షి’ సినిమాలో ప్రిన్స్ గడ్డంతో మేకోవర్ అయిన విషయం తెలిసిందే. ఇదే పోస్టర్ ను ఫస్ట్ లుక్ గా విడుదల చేసారు కూడా! కానీ ఈ సినిమాలో మరో లుక్ కూడా ఉందన్న విషయం తాజాగా యుఎస్ షెడ్యూల్ లో బయటపడింది. ఈ స్టిల్స్ బయటకు రావడంతో, ప్రిన్స్ ‘స్మార్ట్’ లుక్ కాస్త ప్రేక్షకులకు ముందుగానే తెలిసిపోయింది.

దీంతో తాము ఎంతగానో కష్టపడి తీస్తోన్న సినిమా లుక్స్ లీక్ అయినా, వాటికి షేర్ చేసుకోవద్దంటూ చిత్ర యూనిట్ సందేశాలు ఇచ్చినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ ఒరవడి ఆగడం లేదు. ‘మహర్షి’ టీం అధికారికంగా ప్రకటించిన తర్వాత కూడా ఈ షూటింగ్ పిక్స్ లీక్ కావడం, సోషల్ మీడియాలో సర్క్యూలేట్ కావడం యూనిట్ ను కలవరపెడుతోంది.