Mahesh Babu Maharshi 50 Days Functionసూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో మహర్షి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సమ్మర్ లో విడుదల కావడంతో ఆడియెన్స్ ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో 50 రోజులను పూర్తి చేసుకుంది. దీంతో చిత్ర యూనిట్ 50 డేస్ సెలబ్రేషన్స్ కి ప్లాన్ చేస్తోంది. జూన్ 28కి శిల్పా కళా వేదికలో వేలాది మంది అభిమానుల నడుమ ఈ వేడుకను గ్రాండ్ గా నిర్వహించాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. వేడుకకు ఇతర సినీ ప్రముఖులు కూడా ముఖ్య అతిథులుగా రానున్నారు.

చాలా రోజుల తరువాత ఒక సినిమా 50 రోజుల వేడుకను జరుపుకోనుంది. సాధారణంగా గత కొన్ని సంవత్సరాలుగా ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా ఈ రోజుల్లో 25 రోజులకే థియేటర్స్ లో కనిపించకుండా పోతున్నాయి. దీనితో 50 రోజులు అనే కాన్సెప్ట్ పూర్తిగా పోయింది. మరోవైపు మహర్షి త్వరలో అమెజాన్ ప్రైమ్ లోకి రాబోతుంది. జులై 3న ఈ సినిమాను తమ ప్లాటుఫారంలో విడుదల చేస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. దీనితో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మహర్షి మహేష్ బాబు కెరీర్ లో మొదటి 100 కోట్ల షేర్ సినిమా. మిక్సడ్ రివ్యూలు వచ్చినా వేసవి సెలవుల అడ్వాంటేజ్ తో బాగా ఆడింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో, కథానాయికగా పూజ హెగ్డే నటించింది. భూసేకరణ వల్ల రైతులు పడే ఇబ్బందులు అనే సామాజిక అంశం మీద ఈ సినిమాను తీశారు. మరోవైపు మహేష్ బాబు తన తదుపరి చిత్రం సరిలేరు నీకెవ్వరు చిత్రం కోసం తయారు అవుతున్నాడు. ఆ సినిమా వచ్చే నెల 5న సెట్స్ మీదకు వెళ్ళబోతుంది.