mahesh-babu-latestటాలీవుడ్ హీరోగా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రిన్స్ కు ఎనలేని అభిమానగణం ఉండడం సహజమే. అయితే స్థానికంగా ఎంత బలముందో, రెండు తెలుగు రాష్ట్రాలను మినహాయిస్తే ప్రిన్స్ కు అంతే అభిమానగణం ఇతర రాష్ట్రాలలో కూడా కొలువై ఉందన్న విషయం, ప్రిన్స్ సినిమాల రిలీజ్ టైంలో బయట పడుతుంటాయి.

అయితే ఈ సారి మహేష్ బాబు పుట్టినరోజు అందుకు వేదిక అయ్యింది. ఆగష్టు 9వ తేదీన ప్రిన్స్ పుట్టినరోజును పురస్కరించుకుని, తమిళనాడులోని ఓ మల్టీప్లెక్స్ లో “దూకుడు” సినిమాను స్పెషల్ స్క్రీనింగ్ చేస్తుండడం విశేషం. ఒక తెలుగు హీరోకు స్పెషల్ స్క్రీనింగ్ జరుగుతుండడం తమిళనాడులో ఇదే ప్రప్రధమం కావడం చెప్పుకోదగ్గ అంశం.

దీంతో తమిళనాడులోని ప్రిన్స్ అభిమానులంతా రెట్టించిన ఉత్సాహంతో 9వ తేదీ కోసం వేచిచూస్తున్నారు. ఇక స్థానికంగా రెండు తెలుగు రాష్ట్రాలలో వారోత్సవాలు, పుట్టినరోజు నాడు స్పెషల్ స్క్రీనింగ్ లు జరపడం అనేది గత కొన్నేళ్ళుగా చేస్తున్నదే! అయితే ఈ సారి చాలా పెద్ద స్థాయిలో గత నెల రోజులుగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి.