Mahesh Babu -KTRసూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ బాక్స్ ఆఫీస్ వద్ద ఇరగదీస్తోంది. మహేష్ బాబు కేరీర్ లో రెండో 100 కోట్ల సినిమాగా అవ్వబోతుంది. సంక్రాంతి సీజన్, సెలవులు ఈ చిత్రానికి బాగా కలిసొచ్చాయి. ఇది ఇలా ఉండగా సోమవారం నుండి సెలవులు అయిపోవడంతో సినిమా ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.

మహేష్ బాబుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ఉన్న సాన్నిహిత్యం మన అందరికీ తెలిసిందే. గతంలో ఆయన సినిమాలను చూసి కేటీఆర్ పొగిడిన సందర్భాలు కూడా ఉన్నాయి. భరత్ అనే నేను విడుదల సందర్భంగా వారిద్దరూ కలిసి ఒక ఇంటర్వ్యూ కూడా చేశారు.

ఇప్పుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మహేష్ ని కేటీఆర్ సరిలేరు నీకెవ్వరూ చూశారా అని అడిగారు. “ఆయన సినిమా ఇంకా చూడలేదు. చూశాక తప్పకుండా ఫీడ్‌బ్యాక్‌ చెబుతారు,” అని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. మరో ప్రశ్నగా మీ ఆప్తమిత్రుడికి పట్టాభిషేకమంటున్నారు. ఎప్పుడు సి.ఎం. కుర్చీలో చూడవచ్చు. ఎనీ ఇన్‌సైడ్‌ ఇన్ఫర్మేషన్‌? అని అడిగితే మహేష్ తనదైన శైలిలో రిప్లై ఇవ్వడం కొసమెరుపు.

“నాకేం తెలుసు! మా మధ్య సినిమాలు తప్ప, నో పాలిటిక్స్‌. రాజకీయాలు నాకేం తెలియవు,” అని చెప్పారు. ఇది ఇలా ఉండగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ ప్రమోషన్స్ పూర్తి చేసి కుటుంబసమేతంగా దుబాయ్ ప్రయాణం అయ్యారు. వంశీ పైడిపల్లితో ఆయన తన తదుపరి ప్రాజెక్టు చెయ్యబోతున్నారు.