Mahesh Babu going to uk to watch pakistan vs india world cup 2019సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుటుంబసభ్యులతో యూరప్ పర్యటనలో ఉన్నారు. ఇప్పటికే వారు జర్మనీ, స్పెయిన్ చుట్టేశారు. మరోవైపు వారు ఇప్పుడు లండన్ వెళ్లారు. ఈ నెల 14న మాంచెస్టర్ లో జరగబోతున్న ఇండియా, పాకిస్తాన్ ల మధ్య క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ ను మహేష్ బాబు చూడటానికి వెళ్ళనున్నారని సమాచారం. స్వతాహా క్రికెట్టు అభిమాని ఐన మహేష్ బాబు ఈ మ్యాచ్ చూడటానికి చాలా ఆసక్తిగా ఉన్నారట. ఆ మ్యాచ్ చూసి మహేష్ బాబు తిరుగు ప్రయాణం అవుతారు.

ఈనెల 24 నుండి మహేష్ బాబు తన తదుపరి చిత్రం సరిలేరు నీకెవ్వరు షూటింగు మొదలు పెడతారు. ఈ సినిమాను దిల్ రాజు, అనీల్ సుంకర కలిసి నిర్మిస్తున్నారు. ఈ మధ్య మహేష్ సినిమాలు గమనిస్తే చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో వస్తున్నాయి. మాస్ అంశాలకు దూరంగా మహేష్ కథల ఎంపిక ఉందని చెప్పొచ్చు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి ఇలా సోషల్ మెసేజ్ తో మహేష్ సినిమాలు వచ్చాయి. కాని “సరిలేరు నీకెవ్వరు” మెసేజులు ఇచ్చే సినిమా కాదని తెలుస్తుంది.

పక్కా కమర్షియల్ అంశాలు మేళవించిన సినిమాగా….మంచి యాక్షన్ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుబోతుంధని తెలుస్తుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 2020 సంక్రాంతి రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా మహేష్ కెరియర్ లో మరో మైల్ స్టోన్ సినిమాగా నిలుస్తుందని సూపర్ స్టార్ అభిమానులు ఆశిస్తున్నారు. సీనియర్ నటి విజయశాంతి ఈ సినిమాతో తిరిగి కెమెరా ముందుకు రాబోతున్నారు.