Mahesh Babu - KTRతన ట్విట్టర్ లో ఖాతా తెరిచిన నాటి నుండి ‘భరత్ అనే నేను’ విడుదలకు ముందువరకు ప్రిన్స్ మహేష్ బాబు ఫాలో అయ్యేది ఒకే ఒక్క వ్యక్తిని, అది తన బావ గల్లా జయదేవ్ అన్న విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఎంపీ అయిన తర్వాత మహేష్ అలాగే ఫాలో అవుతూ వచ్చారు. కానీ ‘భరత్ అనే నేను’ విడుదల తర్వాత మహేష్ ఖాతాలో ఏకంగా 8 మంది వచ్చి చేరారు.

తొలుత కొరటాల శివను ఫాలో అయిన ప్రిన్స్, ఆ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళిని కూడా చేర్చుకున్నాడు. ఇక తాను ఎంతగానో అభిమానించే సచిన్ టెండూల్కర్ ను, టీమిండియా మాజీ మహేంద్ర సింగ్ ధోనిని, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లిలను కూడా అనుసరిస్తున్నాడు. వీరే కాకుండా 2019 తెలంగాణా ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న కేటీఆర్ కూడా ప్రిన్స్ ఖాతాలో ఉన్నారు.

మహేష్ బాబు ఫాలో అవుతోన్న మొదటి రియల్ పొలిటికల్ లీడర్ కేటీఆర్. గల్లా జయదేవ్ కూడా రాజకీయ నాయకుడే అయినప్పటికీ, ఎంపీ కాకమునుపే మహేష్ ట్విట్టర్ ఖాతాలో గల్లా ఉండడంతో, ఫస్ట్ పొలిటిషియన్ కేటీఆర్ నే పరిగణించాల్సి ఉంటుంది. ‘భరత్ అనే నేను’ సినిమా ప్రమోషన్స్ లో కూడా కేటీఆర్ పాల్గొన్న విషయం తెలిసిందే. చూడబోతుంటే ‘భరత్ అనే నేను’ మూవీ మహేష్ లో చాలా చేంజెస్ ను తీసుకువచ్చినట్లే కనపడుతోంది.