కాలం ఎప్పుడు ఒకరి దగ్గరే ఉండదు అనడానికి నిదర్శనం ఈ పిక్. గతంలో “1 నేనొక్కడినే” విడుదల సమయంలో… ఈ సినిమా పోస్టర్ పై సమంత చేసిన రచ్చ తెలియనిది కాదు. అప్పటినుండి సమంతపై అవకాశం చిక్కినప్పుడల్లా మహేష్ బాబు అభిమానులు సమంతను ఒక ఆట ఆడుకుంటూనే ఉంటున్నారు. తాజాగా “శైలజారెడ్డి అల్లుడు” రూపంలో మహేష్ బాబు అభిమానులకు మరో అవకాశం ఇచ్చింది సమంత.
ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా రిలీజ్ చేసిన ఓ వీడియో సాంగ్ ప్రోమోలో… హీరోయిన్ అను ఇమ్మానుయెల్ హీరో నాగచైతన్య కాలును ముద్దాడే సన్నివేశం ఉంది. దీని స్క్రీన్ షాట్ ను తీసిన ప్రిన్స్ ఫ్యాన్స్… నాడు సమంత ఏదయితే ట్వీట్ చేసిందో, అవే వ్యాఖ్యలు రిపీట్ చేస్తూ ట్వీట్ చేస్తున్నారు. ప్రస్తుతం చైతూ సతీమణిగా ఉన్న సమంతకు ఈ సీన్ చూసి ఎలాంటి ఇబ్బంది కలగలేదా? ఒక్క మహేష్ సినిమాకు మాత్రమే సమంత కళ్ళు తెరుచుకున్నాయా? అంటూ వేస్తోన్న ప్రశ్నలు కోకొల్లలు.
తమ అభిమాన హీరోను అనవసరంగా వివాదంలోకి లాగితే ఎలా ఉంటుందో ప్రిన్స్ అభిమానులు ఎప్పటికప్పుడు సమంతకు రుచిచూపిస్తూనే ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్న భావజాలపు స్వేఛ్చ హక్కును ఈ టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఎలా అయితే వినియోగించుకుందో, నేడు అభిమానులు కూడా అదే హక్కును ఉపయోగించుకుంటూ ప్రశ్నలు వేస్తున్నారు. నాడు జరిగిన వివాదాన్ని మహేష్ ఎప్పుడో వదిలేసినా, ఫ్యాన్స్ మాత్రం వదలలేకపొతున్నారు.