spyder-pre-lookప్రిన్స్ మహేష్ బాబు ఇప్పటివరకు నటించిన 22 సినిమాల విషయంలో నెలకొనని ఆసక్తి, 23వ సినిమా ఫస్ట్ లుక్ పై నెలకొంది. బహుశా ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం వేచిచూసినంతగా భవిష్యత్తులో కూడా మరే సినిమా ఫస్ట్ లుక్ కోసం కూడా అభిమానులు నిరీక్షించకపోవచ్చు. రకరకాల టైటిల్స్… పండగల తేదీలు… ఇలా ప్రతిసారి నిరుత్సాహపడిన ప్రిన్స్ అభిమానులను ఈ ఉగాది పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు. ఎందుకంటే… ఈ ఉగాదికి ఖచ్చితంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కానుందని సమాచారం.

అయితే అంతకుముందే సోషల్ మీడియాలో “స్పైడర్” టైటిల్ తో ఓ పోస్టర్ హంగామా చేస్తోంది. ఓ అభిమాని రూపొందించిన ఈ పోస్టర్ అఫీషియల్ పోస్టర్ కు ముందు ఇచ్చే కిక్ ను అభిమానులకు పంచుతోంది. ‘స్పై’ను రెడ్ కలర్ లో ‘డర్’ను వైట్ కలర్ లో ఉంచుతూ, చుట్టూరా గూడు కట్టిన ఆకారంలో ఉన్న ఈ పోస్టర్ వీక్షించడానికి అఫిషియల్ పోస్టర్ ను మించి ఉంది. బహుశా ప్రిన్స్ టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఈ రేంజ్ లో ఉంటుందో లేదో కూడా సందేహమే… అనిపించే విధంగా అభిమానులను ఈ “స్పైడర్” కట్టిపడేస్తోంది.