mahesh-babu-family-sitara-gautham-namrataటాలీవుడ్ నెంబర్ 1 హీరో ఎవరన్న అంశంపై మహేష్ బాబు – పవన్ కళ్యాణ్ ల మధ్య పోటీ ఉంటుందేమో గానీ, ఫ్యామిలీ ఎంజాయ్ చేసే హీరోలలో ఎవరు ముందు ఉంటారు? అంటే… నిర్వివాదంగా వెలువడే మాట మహేష్ బాబు అని! మొన్నటివరకు మురుగదాస్ సినిమా షూటింగ్ లో పాల్గొన్న ప్రిన్స్ కు ఇటీవల కాస్త విరామం దొరికింది. దీంతో మధ్యలో ముంబాయి వెళ్లి థమ్సప్ యాడ్ చిత్రీకరణలో పాల్గొని, ఆ తర్వాత నుండి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ ట్రిప్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ప్రిన్స్ గారాలపట్టి సితార ఇచ్చిన కొన్ని స్టిల్స్ తో పాటు ప్రిన్స్ ఫ్యామిలీ నలుగురు ఉన్న ఓ ఫోటో తెగ హంగామా చేస్తోంది. గౌతమ్ ను వెనుక నుండి నమ్రత పట్టుకోగా, ముందు నుండి మహేష్ చేతులను అడ్డుకుంటూ నవ్వుతోన్న గౌతమ్, సైలెంట్ గా ఉన్న సితారల ఫ్యామిలీ ఫోటో ప్రిన్స్ అభిమానులను ఆకట్టుకుంటోంది. సినిమాలను, ఫ్యామిలీని మహేష్ బ్యాలెన్స్ చేసినంతగా మరో హీరో చేస్తారో లేదో గానీ, కాస్త గ్యాప్ దొరికితే ఫ్యామిలీతో పండగ చేసుకుంటూ ప్రిన్స్ దర్శనమివ్వడం స్ఫూర్తిదాయకమైన అంశం.