మహేష్ బాబు కుమార్తె సితార సినిమాల్లోకి వస్తుంది. సితార వస్తుంది అనే కంటే ఆమె గొంతు సినిమాల్లోకి వస్తుందని చెప్పవచ్చు. హాలీవుడ్ చిత్రం ఫ్రోజెన్ 2 తెలుగు వెర్షన్ కు ఆమె బేబీ ఎల్సా పాత్రకు వాయిస్ ఇస్తుందట. స్వతహా ఆ పాత్రకు ఫ్యాన్ అయిన సితారా ఆ ఆఫర్ రాగానే చాలా ఎక్సైట్ అయ్యిందని నమ్రత తెలిపారు.
గతంలో 1 – నేనొక్కడినే చిత్రం ద్వారా మహేష్ బాబు కుమారుడు గౌతమ్ తెరంగేట్రం చేసాడు. ఆ సినిమాలో అతను చిన్న మహేష్ బాబు గా నటించాడు. ఇప్పుడు సితార సినిమాలో కనిపించకపోయినా ఆమె గొంతు వినిపించబోతుంది. ప్రతిష్టాత్మక డిస్నీ లాంటి నిర్మాణ సంస్థ చిత్రంలో ఈ అవకాశం లభించడం గమనార్హం.
మరోవైపు యువరాణి ఎల్సా పాత్రకు ప్రముఖ నటి నిత్యామీనాన్ డబ్బింగ్ చెప్తున్నారు. 2013లో విడుదలైన హాలీవుడ్ మూవీ ‘ఫ్రొజెన్’ ప్రపంచ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటేడ్ చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది. ఎల్సా, అన్నా అనే ఇద్దరు అక్కాచెల్లెళ్ల కథే ‘ఫ్రాజెన్’
ఆ సిరీస్లో వచ్చిన మూవీ ఫ్రాజెన్ -2 ఈ మూవీ మొదటి పార్ట్ ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ యానిమేటెడ్ చిత్రం అవార్డును గెలుచుకొన్నది. ఈ చిత్రంలోని లెట్ ఇట్ గో పాటకు క్రిస్టిన్ అండర్సన్-లోపెజ్, రాబర్ట్ లోపెజ్ ఉత్తమ మ్యూజిక్కు ఆస్కార్ అవార్డు లభించింది. ఫ్రొజెన్ 2 చిత్రం నవంబర్ 22 తేదీన ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ అవుతున్నది.
Allu Arjun Fans Behaving Like NTR Fans!
SVP Result: A Wakeup Call To Jagan?