Mahesh Babu Craze a girl behind himమురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ప్రస్తుతం అహ్మదాబాద్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఆన్ లొకేషన్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అహ్మదాబాద్ లో సైతం ప్రిన్స్ క్రేజ్ కు నిదర్శనంగా మారిన ఈ వీడియో వైరల్ అవుతోంది.

షూటింగ్ లో పాల్గొనేందుకు తన బస్సులో నుండి దిగి కారు ఎక్కుతున్న సమయంలో… అక్కడే ఉన్న మహిళ ప్రిన్స్ ను దగ్గరగా చూసేందుకు సెక్యూరిటీని సైతం తప్పించుకుని ప్రిన్స్ వద్దకు చేరుకుంది. అలాగే కారును ఇతర అభిమానులు చుట్టుముట్టిన వైనం చూస్తుంటే… ప్రిన్స్ తెలుగు రాష్ట్రాలలో ఉన్నారా? లేక గుజరాత్ లో ఉన్నారా? అన్న సందేహం కలుగక మానదు.

అలాగే బైక్ కిక్ ను కొడుతున్న మరో ఫోటో కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. యాక్షన్ సన్నివేశంలో భాగంగా రాయల్ ఎన్ ఫీల్డ్ పైన కూర్చుని కిక్ కొడుతున్నట్లుగా ఉన్న ప్రిన్స్ స్టిల్ చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. డిసెంబర్ 21వ తేదీ వరకు అహ్మదాబాద్ లో షూటింగ్ జరగనున్న నేపధ్యంలో… మెజారిటీ టాకీ పార్ట్ చిత్రీకరణ ముగుస్తుందని సమాచారం.