Mahesh-babu-Controversy---MAAప్రిన్స్ మహేష్ బాబుపై తమిళ కమెడియన్ మనోజ్ ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఆగ్రహించిన అభిమానగణం తీవ్రంగా స్పందించడం… ఆ తర్వాత మనోజ్ ప్రభాకర్ క్షమాపణలు చెప్పడం… జరిగాయి. కానీ ఏ రకంగానూ మనోజ్ చేసిన వ్యాఖ్యలు సమర్దినీయం కాకపోవడంతో ‘మా’ అసోసియేషన్ నుండి నడిఘర్ సంఘానికి తాజాగా ఓ లేఖ వెళ్ళింది.

సూపర్ స్టార్ పై చేసిన వ్యాఖ్యలకు మనోజ్ పై చర్యలు తీసుకోవాలన్నది ఈ లేఖ సారాంశం. దీనికి చెన్నైలోని నడిఘర్ సంఘం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి. అయితే ‘మా’ రాసిన ఈ లేఖపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి అండ్ కో చేసిన వ్యాఖ్యల సందర్భంలోనూ, అలాగే కత్తి మహేష్ అంశంలోనూ ‘మా’ ఇలాగే ఎందుకు స్పందించలేదు? అన్న ప్రశ్నలు వేస్తున్నారు.

దీనికి కౌంటర్లుగా… పవన్ కళ్యాణ్ అంశం టాలీవుడ్ కంటే కూడా రాజకీయ పరమైన అంశాలతో ముడిపడి ఉండడం వలనే, ‘మా’ స్పందించలేదని, కానీ మహేష్ విషయం కేవలం టాలీవుడ్ తో మాత్రమే సంబంధం ఉందని, అందుకనే ‘మా’ లేఖ రాసిందన్న భావనలు వస్తున్నాయి. అయితే ఇప్పటికైనా టాలీవుడ్ హీరోలపై జరుగుతున్న దాడులకు ‘మా’ రియాక్ట్ అవ్వడం శుభపరిణామం.