మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ లో బిజీబిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వచ్చే ఏడాది జనవరి 8న సంక్రాంతి సందర్భంగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రం లో చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా కోసం 40రోజుల డేట్స్ కూడా ఇచ్చాడు చరణ్. అయితే ఆగస్టులో విడుదల చెయ్యాలని అనుకున్నాకా రాజమౌళి దానికి అడ్డుచెప్పడట. ఆర్ఆర్ఆర్ విడుదల తరువాతే చరణ్, ఎన్టీఆర్ ల మిగతా సినిమాలు విడుదల కావాలని ఆయన పట్టుబడుతున్నారు.

రాజమౌళి చెప్పాకా కాదనే అవకాశం తక్కువ. అయితే ఈ సినిమాలో చరణ్ ను తప్పించి ఆ పాత్రకు మహేష్ బాబుని ఒప్పించాలని కొందరు చిరంజీవికి సలహా ఇస్తున్నారు. ఈ రకంగా చేస్తే రెండు రకాలుగా ఉపయోగం ఉంటుందని వారు చెబుతున్నారట. “చరణ్ ని తప్పిస్తే చిరంజీవి సినిమా ఆగస్టులో విడుదల చెయ్యొచ్చు, దీని వల్ల బడ్జెట్ అనవసరంగా పెరగదు,” అనేది వారు చెబుతున్న మొదటి పాయింట్.

చిరంజీవి సినిమాలో చరణ్ గెస్ట్ రోల్ చేస్తే అది ఒక్క మెగా ఫ్యాన్స్ కే స్పెషల్. అదే మహేష్ బాబు చేస్తే మెగా అభిమానులతో పాటు మహేష్ బాబు అభిమానుల ఆదరణ కూడా ఉంటుంది. మహేష్ బాబు గనుక ఈ క్యారెక్టర్ చేస్తే అదే కరెక్ట్ స్టెప్ అనే చెప్పుకోవాలి,” అని విమర్శకుల అభిప్రాయం. ఈ విషయంలో చిరంజీవి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.