mahesh babu brahmostavam trailer talk“దూకుడు” సినిమా నుండి “శ్రీమంతుడు” సినిమా వరకు ప్రిన్స్ మహేష్ బాబు నటించిన సినిమాలలో ఒక్క ‘బిజినెస్ మెన్’ సినిమా టీజర్ మినహా మిగతావన్నీ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసినవే. అలా మహేష్ కు తన తండ్రి కృష్ణ జన్మదినోత్సవం ఒక సెంటిమెంట్ గా మారింది. మిస్సైన ఆ ఒక్కటి ‘బిజినెస్ మెన్’ కూడా ఆగష్టులో ప్రారంభమై జనవరిలో విడుదలైంది.

ఇక, తాజా చిత్రం “బ్రహ్మోత్సవం” కూడా ‘బిజినెస్ మెన్’ మాదిరే కృష్ణ పుట్టినరోజును మిస్సైంది. సెప్టెంబర్ లో ప్రారంభమైన ఈ సినిమా సమ్మర్ కు ముస్తాబవుతుండడంతో మొదటి టీజర్ ను కొత్త సంవత్సరం సందర్భంగా విడుదల చేసారు. బహుశా కృష్ణ సెంటిమెంట్ ను మిస్సయ్యారని భావించారో ఏమో గానీ, “బ్రహ్మోత్సవం” విడుదల తేదీని కృష్ణ ద్వారా ప్రకటించారు.

సూపర్ స్టార్ అల్లుడు సుధీర్ బాబు నటించిన “భలే మంచి రోజు” చూసిన సందర్భంలో “బ్రహ్మోత్సవం” టీజర్ పై స్పందించిన కృష్ణ… ఏప్రిల్ 29న విడుదల కాబోతున్న ఈ సినిమా సమ్మర్ చిత్రాలన్నింటిలో నెంబర్ “1” నిలవాలని కోరారు. దీంతో పట్టరాని సంతోషం ప్రిన్స్ అభిమానుల వంతయ్యింది. మరో విశేషమేమిటంటే… ఏప్రిల్ 28వ తేదీన “పోకిరి” విడుదలై ప్రభంజనం సృష్టించింది. దానికి ఒక రోజు తేడాలో విడుదల కాబోతున్న “బ్రహ్మోత్సవం” కూడా ‘బ్లాక్ బస్టర్’ అందుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.