mahesh babu bharath ane nenu with political backgroundప్రిన్స్ మహేష్ బాబుతో కొరటాల శివ దర్శకత్వం వహించే సినిమా “భరత్ అనే నేను” పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందన్న విషయం తెలిసిందే. సిఎం క్యారెక్టర్ లో ప్రిన్స్ కనిపించబోతున్నారన్న టాక్ తో భారీ బజ్ ఏర్పడిన ఈ సినిమాపై అధికారికంగా ఏ ఒక్క విషయము వెల్లడించలేదు. అయితే తొలిసారిగా పెదవి విప్పిన దర్శకుడు కొరటాల శివ, ఈ సినిమా కధ రాజకీయ నేపధ్యంలో సాగుతుందన్న విషయం నిజమేనని అంగీకరించారు.

అయితే ఏ ఒక్క పొలిటికల్ పార్టీని ఉద్దేశించి గానీ, నేతను ఉద్దేశించి గానీ, సెటైరికల్ గా గానీ ఉండదని, రాజకీయ నేపధ్యం ఉంటూనే కధలో ఫ్యామిలీ డ్రామా, రొమాన్స్, హ్యూమన్ ఏమోషన్స్ అన్నీ ఉంటాయని స్పష్టం చేసారు. ఇంత చెప్పిన కొరటాల, ప్రిన్స్ సిఎంగా కనిపించబోతున్నారా? లేదా? అన్నది మాత్రం అధికారికంగా చెప్పలేదు. వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్ ను టార్గెట్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది.

ప్రిన్స్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, ఓ ప్రత్యేక పాటలో అందాల బొమ్మ అనుష్క నృత్యం చేయనుందని టాక్. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించబోతున్న ఈ సినిమాను ‘నిన్ను కోరి’తో ఇటీవల సూపర్ సక్సెస్ అందుకున్న డివివి దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మహేష్ సినిమాలకు ఫ్యాన్సీ డేట్ గా మారిన జనవరి 11న ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.