Mahesh Babu Bharat Anu nenu Satellite Rightsమురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తోన్న “స్పైడర్” సినిమాపై ఎంతటి అంచనాలు ఉన్నాయో తెలిసిన విషయమే. సెప్టెంబర్ 27వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం టాలీవుడ్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ‘బాహుబలి 2’ సినిమా తర్వాత రెండు భాషల్లో నేరుగా విడుదల కాబోతున్న సినిమాగానే కాక, ‘బాహుబలి 2’ తర్వాత విడుదల కాబోతున్న అగ్ర హీరో సినిమా కావడంతో అందరి చూపులు “స్పైడర్” పైనే ఉన్నాయి.

అయితే దసరాకు విడుదల కాబోతున్న ఈ సినిమా కంటే సంక్రాంతికి సిద్ధమవుతున్న “భరత్ అనే నేను” సినిమా ఎక్కువ బజ్ చేస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్ హక్కులు దాదాపుగా 25 కోట్లు పలుకుతున్నాయన్న సమాచారంతో ‘భరత్ అనే నేను’ టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా మారింది. ప్రస్తుతం మార్కెట్ లో క్రేజీ ప్రాజెక్ట్ గా ఉన్న ‘స్పైడర్’కు కూడా ఈ స్థాయిలో డిమాండ్ లేకపోవడం విశేషం. మరి ఇంత హంగామాకు కారణం ఏంటి? అంటూ ట్రేడ్ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది.

కొరటాల – మహేష్ కాంబోలో ఇప్పటికే ‘శ్రీమంతుడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఉండడమా? అంటే దాని కంటే మిన్నగా ‘భరత్ అనే నేను’ సినిమా కధ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ కధలో ముఖ్యమంత్రిగా మహేష్ బాబు కనపడబోతున్నాడనే టాక్ తో, ట్రేడ్ వర్గాలలో భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న ప్రాజెక్ట్ గా “భరత్ అనే నేను” మారిపోయిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రిన్స్ అభిమానులు కూడా “స్పైడర్” కంటే ఎక్కువగా కొరటాల సినిమా కోసమే ఎదురు చూస్తున్నట్లుగా కనపడుతోంది.