mahesh-babu-bharat-ane-nenu-success-meetటాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా సున్నిత మనస్కుడు. తాను చేసిన తప్పులను ధైర్యంగా అంగీకరిస్తాడు. తన ఫాన్స్ కోసం కొత్త సినిమాలు చెయ్యడానికి తహ తహలాడతాడు. ఆమిర్ ఖాన్ తరహా ప్రయోగాలు చెయ్యడం మహేష్ కి ఇష్టం. ఎన్నో ప్రయోగాలు మహేష్ కి చేదు అనుభవాల్నే మిగల్చగా, మహేష్ మాత్రం ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో దారుణమైన పరాజయాలు మహేష్ ని పలకరించాయి. వంశి, బాబీ, నిజం, నాని, అతిధి, బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలు అట్టర్ ప్లాపులు అయ్యాయి. అపజయం పలకరించినపుడల్లా మహేష్, ఇంటి బయటకు కూడా రాకుండా, ఇంట్లోనే గడుపుతాడని తానె స్వయంగా ఇంటర్వూస్ లో చెప్పేవాడు.

రెండు సంవత్సరాలు మహేష్ డిప్రెషన్లోకి పోయి, తనకు శ్రీమంతుడు లాంటి హిట్ ఇచ్చిన కొరటాలనే నమ్ముకున్నాడు. కొరటాల మహేష్ నమ్మకాన్ని నిలబెట్టుకుని, భరత్ అనే నేనుతో విజయాన్ని ఇచ్చాడు.

భరత్ అనే నేను విజయంతో మళ్ళి మహేష్ మొహం లో కళ, కళ్ళలో ఆనందం కనపడుతున్నాయి. మహేష్ నటన ని అందరు మెచ్చుకుంటున్నారు. సినిమా కలెక్షన్ల పరంగాకూడా రికార్డులు క్రియేట్ చేస్తుండటం, మహేష్ కి కొత్త బలాన్నిచ్చింది. ఈరోజు జరిగిన థాంక్స్ మీట్లో ఉత్సాహంగా పాల్గొన్న మహేష్, సినిమా యూనిట్ ను మెచ్చుకున్నారు. కొసమెరుపు ఏంటంటే ఈ ఆనందం లో పడి , సినిమా నిర్మాతను గూర్చి చెప్పడం మర్చిపోయారు. తరువాత మళ్ళి నిర్మాతకు థాంక్స్ చెప్పారు.

విలేఖర్లు, ఫాన్స్ అడిగిన ప్రశ్నలకు, చాలా ఉత్సాహంగా సమాధానాలు ఇచ్చాడు మహేష్.హోలీ ఫైట్ ఎప్పుడు పెడతారు అని అడిగితే ..అసలు ఆ ఫైట్ ఉందని మీకెలా తెలుసండి బాబు అని నవ్వేసాడు సూపర్ స్టార్. తొలి షో చూసి, తన భార్య నమ్రత సినిమా సూపర్ హిట్ అని చెప్పిందన్నాడు, తొలిసారి ట్విట్టర్లో తన భార్యకు ముద్దిస్తున్న ఫోటో పోస్ట్ చేసాడు.

భరత్ అనే నేను తొలి మూడు రోజుల్లో,అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. ఇక నుండి సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో, ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో, మహేష్ స్థానాన్ని ఎక్కడ నిలబెడుతుందో .. వేచి చూడాలి!