Mahesh-Babu-Interviewమరో రోజులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘భరత్ అనే నేను’ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియా మీట్ లో ప్రిన్స్ మహేష్ బాబు పాల్గొన్నారు. ఫ్యామిలీతో కలిసి విదేశీ ట్రిప్ ముగించుకుని వచ్చిన ప్రిన్స్, పలు ఆసక్తికరమైన విషయాలపై కామెంట్ చేసారు. పొలిటికల్ నేపధ్యం కలిగిన సినిమా గనుక మీకు నచ్చిన ‘బెస్ట్ సిఎం’ ఎవరూ అంటూ మీడియా వర్గాలు సూటిగా ప్రశ్నించాయి.

దీనికి బదులుగా ‘మీరు కాంట్రవర్సీలు క్రియేట్ చేయకండి, రెండు రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది, ఒకరి పేరు చెప్తే మరొకరికి ఇబ్బంది, ఎందుకొచ్చిందండి’ అని చెప్పడంతో మీడియా ప్రముఖులంతా నవ్వేసారు. ఇక రిలీజ్ రోజైన ఏప్రిల్ 20వ తేదీన మా అమ్మ గారి పుట్టినరోజు అని ముందుగా మంజుల ఫోన్ చేసి చెప్పిందని, అప్పుడు చాలా బాగా అనిపించిందని సదరు సంగతులను ప్రిన్స్ గుర్తు చేసుకున్నారు.

అయితే ఏప్రిల్ 20న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు కూడా అని ఓ జర్నలిస్ట్ చెప్పగా, ‘ఇంకా మంచి రోజు, ఇంకా మంచిది’ అంటూ చెప్పడంతో జర్నలిస్ట్ లంతా నవ్వేసారు. పొలిటికల్ సినిమా గనుక, మహేష్ ను ఏదొకటి టెంప్ట్ చేసి, దాని ద్వారా లబ్ది పొందాలని భావించిన మీడియా వర్గాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా సింపుల్ గా, ముక్కుసూటిగా ప్రిన్స్ ముచ్చటించారు.