Mahesh-Babu-Interviewటాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ‘సెన్సాఫ్ హ్యుమర్’ గురించి ఇప్పటికే చాలామంది దర్శకులు చాలా సందర్భాలలో చెప్పి ఉన్నారు. ప్రిన్స్ సతీమణి నమ్రత కూడా వివిధ సందర్భాలలో మహేష్ లో నాకు నచ్చేది అదేనని చెప్పారు. అయితే మీడియా ప్రతినిధులకు మరోసారి ప్రిన్స్ ‘సెన్సాఫ్ హ్యుమర్’ రుచి ఏ పాటిదో తెలిసి వచ్చింది. ‘భరత్ అనే నేను’ ప్రమోషన్ లో పాల్గొన్న మహేష్ నోటి వెంట వచ్చిన పంచ్ లకు జర్నలిస్ట్ లు ఆహ్లాదకరంగా నవ్వుకున్నారు.

ప్రశ్న – ఒక సంవత్సరంన్నర్ర నుండి ట్రావెల్ అయిన సినిమాతో మీరు ఎలా బయటపడ్డారు?
పంచ్ – అందుకే ఫ్యామిలీతో కలిసి విడుదలకు ముందే ట్రిప్ వెళ్లి వచ్చా.

ప్రశ్న – రోజూ న్యూస్ పేపర్ చదువుతారా?
పంచ్ – ఎక్కువగా చదవను… మంచి విషయాలేమున్నాయ్..!

ప్రశ్న – ఇందులో జనాలను కష్టపెట్టే సీన్లు ఉన్నట్టున్నాయ్?
పంచ్ – రెండు రోజుల్లో సినిమా వస్తుంది కదండీ… చూడండి..!

ప్రశ్న – చంద్రబాబు పుట్టినరోజు కూడా ఏప్రిల్ 20వ తేదీనే
పంచ్ – ఇంకా మంచి రోజు, ఇంకా మంచి విషయం

ప్రశ్న – వంశీ పైడిపల్లి సినిమా ఎలా ఉంటుంది?
పంచ్ – బాగుంటది… జూన్ లో మొదలవుతుంది..!

ప్రశ్న – ఈ సినిమా షూటింగ్ కు అడ్డంకులు ఉన్నట్లున్నాయ్?
పంచ్ – ఇంతకీ మేం జూన్ లో షూటింగ్ చేయగలమా? లేదా?

ప్రశ్న – ‘1 నేనొక్కడినే’ హీరోయిన్ కు అవకాశాలు రాలేదు?
పంచ్ – ఆ అమ్మాయే చేయలేదండి… ఎవరికి తెలుసు..!

ప్రశ్న – మీ దృష్టిలో బెస్ట్ సిఎం?
పంచ్ – కాంట్రవర్సీ వద్దు సార్… ఇంకా రెండు రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది..!

ప్రశ్న – ఫంక్షన్ లో ఎన్టీఆర్ గారు చెప్పిన ఎక్స్ పెరిమెంట్స్ పై మీ కామెంట్?
పంచ్ – ఇంకా ఎక్స్ పెరిమెంట్స్ చేసే ఓపిక పోయిందండి… నాన్న గారి అభిమానులు ఇంటికొచ్చి కొట్టేలా ఉన్నారు.

ప్రశ్న – మీరు – చరణ్ – ఎన్టీఆర్ కలిస్తే ఏం మాట్లాడతారు?
పంచ్ – సినిమాలు తప్ప, మిగతావన్నీ!

ఇలా పంచ్ లతో ప్రిన్స్ మీడియా సమావేశం అంతా నిండిపోయింది. బహుశా చదివితే అంతగా రుచించకపోవేమో గానీ, ప్రిన్స్ నోటి వెంట వింటుంటే మాత్రం అక్కడున్న జర్నలిస్ట్ ల మాదిరి నవ్వుకోవడం మాత్రం ఖాయం. ఈ మీడియా మీట్ లో చెప్పినట్లు… సినిమా విడుదలకు ముందు ఓ చిన్న టెన్షన్ ఉండడం సహజమే, కానీ ‘భరత్ అనే నేను’ రిలీజ్ కు ముందు మాత్రం మహేష్ ఫుల్ కాన్ఫిడెన్సు గా కనపడుతుండడం అభిమానులకు పండగ లాంటి విషయం.