Flash-Bharat-Ane-Nenu-Censored---A-Reportప్రిన్స్ అభిమానులు ఎంతగానో నిరీక్షిస్తున్న “భరత్ అనే నేను” విడుదలకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. సెన్సార్ బోర్డు నుండి ‘యు/ఎ’ సర్టిఫికేట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ధియేటర్లలో ప్రదర్శనకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. దీంతో ఫస్ట్ డే ఏ రేంజ్ వరకు “భరత్ అనే నేను” సాధిస్తాడోనని అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఎదురు చూస్తున్నారు.

‘శ్రీమంతుడు’ సక్సెస్ తర్వాత విడుదలైన రెండు చిత్రాలు ‘బ్రహ్మోత్సవం, స్పైడర్’లు తొలి రోజు కూడా అంచనాలను అందుకునే విధంగా కలెక్షన్స్ ను అందుకోకపోవడంతో ప్రిన్స్ స్టామినాపై సందేహాలు నెలకొన్నాయి. దీంతో మహేష్ రేంజ్ ను పరీక్షించే చిత్రంగా ‘భరత్ అనే నేను’ నిలవనుంది. ఇప్పటికే యుఎస్ ప్రీమియర్స్ లెక్కల సవరణకు హంగామా మొదలైంది.

‘బాహుబలి 2’ని మించిన స్థాయిలో మహేష్ రేంజ్ ను తెలిపే స్థాయిలో ఏకంగా 2000 స్క్రీన్లలో ప్రీమియర్ షోలు పడుతుండడంతో, భారీ రికార్డులను ‘భరత్ అనే నేను’ కొల్లగొడుతోందన్న టాక్ ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ‘శ్రీమంతుడు’ పేరిట ఉన్న రికార్డులను తాజాగా ‘రంగస్థలం’ 3 మిలియన్స్ తో చెరిపివేయడంతో, మరోసారి ప్రిన్స్ ప్రభంజనం చూపించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

అయితే ఏది సాధించాలన్నా ‘భరత్ అనే నేను’ ఫస్ట్ టాక్ చాలా కీలకం కానుంది. ‘బ్రహ్మోత్సవం, స్పైడర్’ సినిమాల విషయాలలో ఈ ఫస్ట్ టాక్ అత్యంత దారుణంగా రావడంతోనే ‘రికార్డ్’ అన్న మాటకు ఆస్కారం లేకుండా పోయింది. కొరటాల మార్క్ మేకింగ్ మరోసారి ‘శ్రీమంతుడు’ ఫీట్ ను రిపీట్ చేస్తుందని అభిమానులంతా ఆశాభావంతో ఉన్నారు.

టాక్ పాజిటివ్ అయితే గనుక ‘భరత్ అనే నేను’కు ఓవర్సీస్ లో రికార్డులకు ఆకాశమే హద్దు అన్న ఒక్క మాట అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక ఏపీ, తెలంగాణాలలో ఇటీవల ‘రంగస్థలం’ నాన్ బాహుబలి రికార్డులను నెలకొల్పిన నేపధ్యంలో… ‘భరత్ అనే నేను’ ఎలా వసూలు చేస్తుందన్న ఆసక్తి ట్రేడ్ వర్గాల్లో నెలకొంది. అన్నింటికీ సమాధానం ‘ఫస్ట్ షో – ఫస్ట్ టాక్’ చెప్పనుంది