Flash-Bharat-Ane-Nenu-Censored---A-Reportప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ప్రిన్స్ అభిమానులు లేవనెత్తుతున్న ప్రశ్నలు ఇవి. ‘భరత్ అనే నేను’ సినిమా రిలీజ్ విషయంలో అన్యాయం జరుగుతోందని, ముఖ్యంగా నైజాం ఏరియాలో ఇది స్పష్టంగా కనపడుతోందని, దీనిని పట్టించుకోవాలంటూ అభిమానులే నిర్మాతలకు, పంపిణీదారులకు ట్వీట్లు పెడుతూ నిరసన తెలియజేస్తుండడం విశేషం. సినిమా విడుదలకు ఒక రోజు సమయం మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ, ఇంకా ధియేటర్లను ఖరారు చేయకపోవడం అభిమానులకు విస్మయానికి గురి చేస్తోంది.

ఇలా అయితే ఓపెనింగ్స్ విషయంలో ‘భరత్ అనే నేను’ భంగపాటుకు గురికావడం తధ్యం అనే ఆవేదన అభిమానుల్లో ఎక్కువగా వ్యక్తమవుతోంది. నైజాం విషయంలో మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో గానీ, ఏపీలో స్పెషల్ షోలకు వచ్చిన అనుమతులలో మాత్రం కాస్త ‘వలపత్యం’ ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించి తీరాలి. ఉదయం 10 లోపున ఒక షోకు మాత్రమే అనుమతి ఇస్తూ ఏపీ సర్కార్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇదే ‘రంగస్థలం’ సినిమాకు విరుద్ధంగా ఉండడం విశేషం.

‘రంగస్థలం’ సినిమా ఏపీ వ్యాప్తంగా సాధారణ ధియేటర్లలో పాటు మల్టీప్లెక్స్ లలో కూడా వేకువజామున 5 గంటల నుండి షోలను వేసారు. కానీ ‘భరత్’ విషయంలో అలా జరగడం లేదు. కేవలం మూడు వారాల వ్యవధిలో ఏం మార్పులు సంభవించాయో, లేక నిర్మాతే అనుమతి కోరలేదో గానీ, ‘భరత్ అనే నేను’ రిలీజ్ చేస్తున్న విధానంలో అభిమానులు అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవం. ఈ ప్రభావం ఓపెనింగ్స్ పైన పడడమే కాక, మహేష్ స్టామినాను ప్రశ్నించేలా చేస్తుందన్నది అభిమానుల ఆవేదన.