Mahesh Babu Attends Functionసినీ వేడుకలకు పెద్దగా హాజరు కాని ప్రిన్స్ మహేష్ బాబు, ఫ్యామిలీ ఫంక్షన్స్ ను మాత్రం వదిలిపెట్టరు. కుటుంబానికి సంబంధించిన ఏ చిన్న వేడుక అయినా, మహేష్ తప్పకుండా హాజరవుతారు. అందులో భాగంగానే తన పెద్ద బావ అయినటువంటి గల్లా జయదేవ్ మేనల్లుడు విక్రమాదిత్య (డాక్టర్ రమాదేవి మరియు డాక్టర్ ప్రసాద్ ల తనయుడు) నిశ్చితార్ధ వేడుకకు సతీమణి నమ్రతతో కలిసి ప్రిన్స్ హాజరయ్యారు.

ఓ పక్కన ‘స్పైడర్’ సినిమాను వీలైనంత త్వరగా ముగించేయాలన్న తలంపుతో బిజీ షెడ్యూల్ తో ఉన్నప్పటికీ, ఈ వేడుకను ప్రిన్స్ మిస్సవ్వలేదు. తన పెద్ద బావ గల్లా జయదేవ్ అంటే మహేష్ కు ప్రత్యేకమైన అభిమానం అన్న విషయం అభిమానగణానికి తెలిసిన విషయమే. ట్విట్టర్ లో మహేష్ ఫాలో అయ్యే ఏకైక వ్యక్తి గల్లా జయదేవ్ అన్నది కూడా అభిమానులకు తెలిసిందే.