Mahesh-Babu-AR-Murugadossసినిమా షూటింగ్ ప్రారంభించి చాలా నెలలు గడుస్తున్నా… ఇంతవరకు ఒక్క అధికారిక ప్రకటన గానీ, ఒక అఫిషియల్ పోస్టర్ గానీ విడుదల చేయని మురుగదాస్ – మహేష్ చిత్ర షూటింగ్ పై అప్ డేట్స్ వస్తున్నాయి గానీ, అభిమానులకు, సినీ ప్రేక్షకులకు కావాల్సిన సమాచారం లభించడం లేదు. సినిమా విడుదల విషయంలోనూ అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. కాసేపు ‘బాహుబలి’ సినిమా కంటే ముందని, మరికాసేపు తర్వాత అని, తాజాగా బిఎ రాజు ఇచ్చిన సమాచారం మేరకు జూలై 23వ తేదీన అని… ఇలా రకరకాల సమాచారం హల్చల్ చేస్తోంది.

అయితే వీటన్నింటికి దర్శకుడు మురుగదాస్ త్వరలోనే శుభంకార్డు వేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని వివరాలను స్వయంగా మురుగదాస్ ప్రకటన చేయనున్నారని కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. ఫస్ట్ లుక్, ఫస్ట్ టీజర్ విశేషాల నుండి ఆడియో, సినిమా రిలీజ్ డేట్ ల వరకు అన్నింటిపై ఫుల్ క్లారిటీ ఇవ్వబోతున్నారట. అయితే, ఇంతవరకు వేచిచూసిన ప్రిన్స్ అభిమానులకు పండగ కలిగించే విధంగా టీజర్ మరియు సినిమా ఉంటుందన్న టాక్ కూడా కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి.

తెలుగు, తమిళ భాషల్లో నిర్మాణం అవుతోన్న ఈ సినిమాను, హిందీ భాషలోకి కూడా అనువాదం చేయబోతున్నారనేది లేటెస్ట్ గా సందడి చేస్తోన్న సమాచారం. బహుశా దీనిపై కూడా మురుగదాస్ స్పష్టత ఇస్తారేమో చూడాలి. ‘బాహుబలి’ తర్వాత హిందీలో విడుదలైన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ అబాసుపాలు కావడంతో, హిందీలోకి ఈ సినిమాను అనువదిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.