mahesh-babu-ar-murugadoss-movie-accidentమురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం వేసిన సెట్స్ పైన దీపావళి టపాసులు పడి, తగలపడి పోయిందన్న ప్రచారం జరిగింది. దీంతో అసలు ఆ సమయంలో సెట్స్ లో ఎవరు ఉన్నారు? షూటింగ్ మొదలైందా? అనే ఆసక్తి ప్రిన్స్ అభిమానుల్లో నెలకొనగా, ఇదంతా ఒట్టి పుకారే అన్న సమాచారం బయటకు రావడంతో, ప్రిన్స్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

గతంలో ‘ఖలేజా’ షూటింగ్ సందర్భంలో… ఆ సినిమా కోసం వేసిన సెట్స్ ను తెలంగాణా ఉద్యమంలో భాగంగా తగలపెట్టడంతో సెంటిమెంట్ పరంగా ప్రిన్స్ సినిమాలకు ఇది అవరోధంగా మారింది. దీంతో ఈ సినిమా సెట్స్ కూడా తగలబడితే, అభిమానుల ఆశలు కూడా నీరుగారిపోతాయేమోనన్న ఆందోళన తొలుత ప్రిన్స్ అభిమానుల్లో వ్యక్తం కాగా, ఇదంతా ఒట్టి పుకారేనని తేలిన తర్వాత ఫుల్ హ్యాపీ అయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ 14వ తేదీ వరకు హైదరాబాద్ లో జరగనుండగా, 23 నుండి అహ్మదాబాద్ కు షిఫ్ట్ కానుంది.