mahesh-babu-ar-muragadoss-movie-leakమురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న సినిమాకు సంబంధించి అధికారిక సమాచారం ఇప్పటివరకు ఏమీ లేదు. షెడ్యూల్స్ పూర్తవుతున్నాయి, మొదలవుతున్నాయి అన్న విషయాలు తప్ప, టైటిల్ గురించి గానీ, రిలీజ్ గురించి గానీ, ఫస్ట్ లుక్, టీజర్ తదితర విశేషాలపై ఎలాంటి వివరణ లేదు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఏదొక వార్త సోషల్ మీడియాలో ఎప్పుడూ హల్చల్ చేస్తూనే ఉంటోంది.

ఆ క్రమంలోనే తాజాగా మరొక వార్త నెట్టింట లీక్ అయ్యి సందడి చేస్తోంది. అయితే ఈ వార్త ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులకు మాంచి కిక్ ఇస్తోంది. ఎంతలా అంటే… ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారా? అనేటంతగా..! అవును… లేటెస్ట్ టాక్ ప్రకారం… ఈ సినిమాలో ఇంటర్వెల్ కు ముందు 20 నిముషాల పాటు సాగే సన్నివేశం సినిమాకే హైలైట్ కాబోతుందని తెలుస్తోంది. చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు అవాక్కయ్యే విధంగా ఈ సీన్ ఉంటుందని ప్రిన్స్ అభిమానులను మరింతగా ఊరిస్తున్నారు.

మురుగదాస్ తన టేకింగ్ తో ఈ సినిమాను మరో ఎత్తుకు తీసుకెళ్లబోతున్నాడని, ఆ స్థాయి నమ్మకంతోనే ఇటీవల ‘బ్లాక్ బస్టర్ ఆన్ ది వే’ అంటూ సందేశం ఇచ్చారని, ఈ సినిమా షూటింగ్ ముగిసేపోయే సమయానికి దాదాపుగా 150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగవచ్చన్న అంచనాలు మొదలయ్యాయి. ఫిబ్రవరి నాటికి షూటింగ్ మొత్తం ముగిసిపోయే విధంగా షెడ్యూల్స్ ఉన్నాయని, సమ్మర్ సెన్సేషన్ గా ఈ సినిమా ముస్తాబవుతోందని టాలీవుడ్ వర్గాల నుండి వెలువడుతోన్న కబురు.