ప్రిన్స్...-యంగ్-టైగర్...-రచ్చ-రచ్చే..!ప్రిన్స్ – యంగ్ టైగర్ అభిమానుల హంగామా మొదలైంది. ఈ ఇద్దరు హీరోలు పాల్గొన్న “ఎవరు మీలో కోటీశ్వరులు” కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది.

గడిచిన కొన్ని నెలలుగా ఈ ఎపిసోడ్ కోసం ఇరువురు హీరోల అభిమానులకు తోడు సినీ ప్రేమికులు, బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

స్మాల్ స్క్రీన్ ను ఓ షేక్ చేసేందుకు సిద్ధమవుతున్న ఈ ‘పూనకాల ఎపిసోడ్’ అతి త్వరలో ప్రసారం కానుందని ఈ సందర్భంగా జెమిని టీవీ స్పష్టం చేసింది.

ముఖ్యంగా మహేష్ బాబు ఒక షోలో మొదటిసారిగా కనిపించబోతుండడం ఈ ఎపిసోడ్ కు ప్రధాన హైలైట్ గా నిలిచింది.

ప్రిన్స్ ‘సెన్స్ ఆఫ్ హ్యూమర్’ గురించి చాలా సందర్భాలలో సినీ ప్రముఖులు వెల్లడించారు. ఈ ప్రోమో అందుకు నిదర్శనంగా ఉందని చెప్పొచ్చు.

ఇంకేం… ఇద్దరు హీరోలకు కావాల్సిన ఎమోషన్ దొరికింది. దీంతో సోషల్ మీడియా అంతా ఈ ఇద్దరి హీరోల హంగామానే! రచ్చ రచ్చే!