Mahesh babu about sitara character in brahmostavam“ఒక సినిమా హిట్ కావడానికి చిత్ర బృందం మొత్తం కృషి ఉంటుంది కానీ, అదే ఫ్లాప్ అయితే దానికి ఎక్కువ బాధ్యత కధానాయకుడిగా తనపైనే ఎక్కువ ఉంటోందని” గతంలో ప్రిన్స్ మహేష్ బాబు పలు సందర్భాలలో చెప్పారు. మరి ‘బ్రహ్మోత్సవం’ సినిమా ఫలితం ఎవరి అకౌంట్ లోకి వెళ్తుంది? భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం అందుకోలేక సినీ అభిమానులను, ప్రిన్స్ ఫ్యాన్స్ ను పూర్తిగా నిరాశ పరిచింది. దీంతో మహేష్ దీనిపై ఏం కామెంట్ చేస్తారో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

అయితే ఓ ప్రముఖ దినపత్రిక మహేష్ మాటగా… ‘బ్రహ్మోత్సవం’ ఫలితం గురించి ప్రచురించింది. అభిమానులకు పిలుపునిస్తూ… ‘బ్రహ్మోత్సవం’ ఫలితంపై దర్శకుడిని నిందించకండి… ఆ స్క్రిప్ట్ ను ఎంచుకోవడం పూర్తిగా నా ఛాయిస్… ఫెయిల్యూర్ కు సంబంధించిన పూర్తి బాధ్యతను తానే వహిస్తాను… నా నిర్ణయాత్మక లోపం వలనే ఆ స్క్రిప్ట్ ను ఎంచుకున్నానని… మహేష్ తన సన్నిహితులతో చెప్పినట్లుగా సదరు పత్రిక ప్రచురించింది. నిజానికి ‘బ్రహ్మోత్సవం’ విడుదలకు ముందే పలు ఇంటర్వ్యూలలో ప్రిన్స్ ఈ విషయాన్ని ప్రస్తావించారు.

‘హీరో’ అంటూ ఒప్పుకోకుంటే అసలు సినిమా రూపాంతరం చెందదు కదా… అందుకని ఒక సినిమా ఫెయిల్ అవ్వడానికి ప్రధానంగా హీరోనే కారణమంటూ… ఇది తన వ్యక్తిగత అభిప్రాయంగా ప్రిన్స్ చెప్పుకొచ్చారు. ‘బ్రహ్మోత్సవం’ విషయంలో జరిగింది కూడా అదేనన్న విషయాన్ని తాజాగా ధృవీకరించారని తేటతెల్లమవుతోంది. హాలిడే కోసం లండన్ వెళ్తూ వెళ్తూ ఈ ‘మంచి మాట’లను అభిమానుల చెవిన పడేయాలని భావించారో ఏమో గానీ, ప్రిన్స్ ఆలోచనలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

హిట్ వస్తే హీరో క్రేజ్ అని, ఫ్లాప్ అయితే దర్శకుడు తప్పు అని భావించే సినీ జనాలు, అభిమాన వర్గాలకు బహుశా ప్రిన్స్ ఆదర్శప్రాయుడిగా నిలుస్తారని భావించాలి. లండన్ నుండి తిరిగి జూన్ 20వ తేదీన రానున్న మహేష్, తన తదుపరి సినిమా మురుగదాస్ దర్శకత్వంలో నటించబోయే సినిమా కోసం సిద్ధమవుతారు. ఈ సినిమా ప్రిన్స్ మళ్ళీ బౌన్సు బ్యాక్ అవుతారని అభిమానుల ఆకాంక్ష.