Mahesh Babu - A R Murugadoss Latest Newsశివరాత్రి సందర్భంగా ప్రిన్స్ తో తీస్తున్న సినిమా విడుదల తేదీని ప్రకటించిన మురుగదాస్ కు, మహేష్ బాబు రిప్లై ఇచ్చారు. ‘వెయిటింగ్ సార్, జూన్ 23వ తేదీ అనేది సెలబ్రేషన్స్ జరుపుకునే రోజు’ అంటూ ప్రిన్స్ ట్విట్టర్ ఖాతా నుండి వెలువడడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సినిమా విషయంలో పాటిస్తున్న గోప్యత, సినిమాపై అంచనాలు పెంచడానికి ఉపయోగపడుతోంది.

హాలీవుడ్ తరహా యాక్షన్ థ్రిల్లర్ కు సిద్ధంగా ఉండాలంటూ… సినీ జనాలు కూడా తమ భావాలను సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తున్నారు. జూన్ 23… మార్క్ చేసుకోండి… ప్రిన్స్ – మురుగదాస్ ల సెల్యూలాయిడ్ వండర్ విజువల్ రూపం సిద్ధించుకోబోతోంది… అంటూ కోలీవుడ్ వర్గాలు కూడా ఈ సినిమాను ఆకాశానికెత్తేస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ స్టిల్ కూడా హల్చల్ చేస్తోంది.

షార్ట్ లెంగ్త్ షర్టుతో ఉన్న ప్రిన్స్ లుక్ స్టైలిష్ గా, చాలా ఫ్రెష్ గా కనపడుతోంది. ‘బ్రహ్మోత్సవం’ సినిమాతో బాగా డీలాపడిన మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా పైనే అంచనాలు పెట్టుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మాణం జరుగుతోన్న ఈ సినిమాను హిందీలోకి కూడా అనువదించాలనే డిమాండ్ రావడంతో, తాజాగా హిందీ వర్షన్ కు సంబంధించిన పనులు కూడా ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది.