ప్రస్తుతం ‘భరత్ అనే నేను’ సక్సెస్ ఇచ్చిన ఆనందంలో ఉన్న ప్రిన్స్ ఫ్యామిలీతో కలిసి పారిస్ లో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. తన తదుపరి చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనుండగా, ఈ సినిమా షూటింగ్ జూన్ 7వ తేదీ నుండి ప్రారంభం కానుందని స్వయంగా ప్రిన్స్ సెలవిచ్చారు. దిల్ రాజు – వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమా కధకు సంబంధించిన లైన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

“ఇది ఇద్దరు స్నేహితులకు సంబంధించిన కధ అని, కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని” ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో అల్లరి నరేష్ మరో కీలకపాత్ర చేస్తుండడం ఈ లైన్ కు మరింత బలాన్నిస్తోంది. గతంలో ఈ సినిమా కధ ఓ హాలీవుడ్ చిత్రానికి కాపీ అంటూ ప్రచారం జరుగగా, దానిని వంశీ పైడిపల్లి ఖండించారు. అయితే ‘ఎవడు’ సినిమా, ‘ఊపిరి’ హాలీవుడ్ రీమేక్ కావడంతో, సహజంగానే వంశీపై హాలీవుడ్ ప్రభావం ఎక్కువుందన్న ముద్ర పడింది.