Mahesh-Babu-Vs-Ram-Charan-Sankranti-Clash-Sure!-Who-Will-Make--Itసిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్లను మించిన అందగాడిగా ప్రిన్స్ కు పేరుంది. నిజమే… అందులో అక్షరం పొరపాటు లేదు. కానీ ఒక్క విషయంలో మాత్రం మహేష్ వీక్ నెస్ కనపడుతూ వస్తోంది. ముఖ్యంగా డ్యాన్స్ కంపోజింగ్ లో మహేష్ తీరు అభిమానులను ఏ మాత్రం సంతృప్తి పరచడం లేదు. గతంలో రెండు, మూడు స్టెప్స్ వేసినా అందులో గ్రేస్ ఉండేవి, కానీ ప్రస్తుతం ఎక్సర్ సైజ్ లు చేస్తున్నట్లుగా పాటలు కంపోజ్ చేస్తుండడంతో, ఫ్యాన్స్ కూడా నిరాశ చెందుతున్నారు.

ఇక మహేష్ 25వ సినిమాలో అయితే ఈ లోటుకు హీరోయిన్ పూజా హెగ్డే రూపంలో మరింత ఎక్కువయ్యిందని చెప్పవచ్చు. డ్యాన్సర్ గా పూజా రేంజ్ ఏమిటో ‘దువ్వాడ జగన్నాధమ్’ చెప్పకనే చెప్పింది. ఏకంగా అల్లు అర్జున్ తో పోటీపడి మరీ స్టెప్పులు ఇరగదీసింది. అలాంటి పూజతో చేయడం మహేష్ నిజంగా ఛాలెంజ్ లాంటిదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో ప్రిన్స్ కు తగ్గట్లుగా సరైన డ్యాన్సింగ్ మూవ్మెంట్స్ కంపోజ్ చేయాలనేది ఫ్యాన్స్ కోరిక. లేదంటే పూజాను పెట్టుకుని కూడా వృధా చేసినట్లే అవుతుంది!