Mahesh Babu - Vamsi -Paidipallyప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రారంభమైన ప్రమోషన్ లో భాగంగా… రోజుకో అక్షరం విడుదల చేస్తోన్న చిత్ర యూనిట్, ఈ సినిమా పేరు “రిషి” అని చెప్పకనే చెప్తున్నారు. అధికారిక ప్రకటన రాలేదు గానీ, ఇప్పటికే “రిషి” అన్న టైటిల్ అంతటా వ్యాప్తి చెందింది. అయితే ఈ టైటిల్ ప్రిన్స్ అభిమానులకు అంతగా నచ్చలేదన్న భావన సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతోంది.

మహేష్ బాబు నటించే 25వ సినిమాగా దీనికి ఎంతో క్రేజ్ ఉంది. అలాంటి సినిమాకు ఓ సాధారణ ‘రిషి’ అన్న పేరు ఎలా సూట్ అవుతుందో, దర్శకుడు వంశీ పైడిపల్లి ఎలా సెట్ చేస్తాడన్నది ప్రశ్నార్ధకంగా మారింది. బహుశా చివరి నిముషంలో ఇది మహేష్ రోల్ పేరు, సినిమా టైటిల్ వేరే ఉందన్న దర్శకనిర్మాతల ట్విస్ట్ లు ఉన్నా ఉండొచ్చేమో! ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు “రిషి” అన్న పేరు బయటకు రావడం అయితే ఖరారయ్యింది.