Mahesh Babu 25 (MB25) first lookవంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తోన్న సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ మహేష్ బాబు జన్మదినోత్సవం సందర్భంగా ఆగష్టు 9వ తేదీన విడుదల కానుంది. అయితే ఈ లుక్ తో పాటు టైటిల్ ను కూడా రివీల్ చేస్తారా? లేదా? అన్నది అభిమానుల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది.

ప్రిన్స్ గత సినిమాలను పరిశీలిస్తే… ముఖ్యంగా టైటిల్ విషయంలో భిన్న రుచులు ఫ్యాన్స్ చవిచూశారు. ‘స్పైడర్’ సినిమా సందర్భంలో దాదాపుగా ఓ పది టైటిల్స్ వినిపించగా, చివర్ నిముషంలో ‘స్పైడర్’ను ప్రకటించారు. ఇక సినిమా ప్రారంభాని కంటే ముందే ‘భరత్ అనే నేను’ టైటిల్ ను కొరటాల ఫిక్స్ చేయడం విశేషం.

ప్రస్తుతం కూడా తాజా సినిమా టైటిల్ విషయంలో చిత్ర యూనిట్ మల్లగుల్లాలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. రైతులతో ముడిపడిన అంశం కావడం, స్టూడెంట్ బ్యాక్ గౌండ్ ఉండడం, మహేష్ రేంజ్ కు తగ్గ టైటిల్ ను ఎంపిక చేయడం చిత్ర యూనిట్ కు తలకు మించిన భారంగా మారినట్లు తెలుస్తోంది. దీంతో ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.