Not-Sankranthi-Mahesh-Babu-25-Aiming-for-Another-Festivalసినీ ఇండస్ట్రీలోనే కాదు, ఎక్కడైనా “వారసత్వం”కు ఇచ్చే ప్రాముఖ్యత సాధారణంగా ఉండదు. మరి మంచి మనసుకు నిదర్శనంగా పేర్కొనే సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకోవడమంటే మాటలు కాదు. దానిని మోయలేక రమేష్ బాబు చతికిలపడినా, ఆ బరువును, బాధ్యతలను రెండు చేతులతో ఒడిసి పట్టుకుని, తండ్రికి మించిన తనయుడు అనిపించుకోవడంలో ప్రిన్స్ మహేష్ బాబు సాధించిన కీర్తి అమోఘం.

సినీ ఇండస్ట్రీలో నిర్మాతల హీరో అంటే మొదటగా గుర్తుకు వచ్చేది సూపర్ స్టార్ కృష్ణ పేరే. ఆర్ధికంగా వెనుకబడిన వారికి వెన్నుదన్నుగా నిలవడంతో, మంచి మనసున్న మనిషిగా కృష్ణ పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. కట్ చేస్తే… నాటి సూపర్ స్టార్ కు మించిన ప్రేక్షకాధరణ నేటి ప్రిన్స్ సొంతం. ఇదేదో వారసత్వంగా వచ్చింది కాదు. ఇరవై ఏళ్ళ పయనంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా… తన కష్టంతో ఘనంగా సాధించుకున్నాడు.

బహుశా ఆ జీన్స్ లోనే ఉందేమో గానీ, కృష్ణకున్న మంచి మనసు మహేష్ సొంతమనేది సినీ జనాల మాట. ఈ ఇరవై ఏళ్ళ కెరీర్ లో ఒక్క వివాదం కూడా మహేష్ దరిచేరలేదంటే… ఎంత సంస్కారవంతంగా ప్రిన్స్ జీవనం సాగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. “మ్యాన్ విత్ ఎ గోల్డెన్ హార్ట్” అన్న పదానికి నిదర్శనంగా నిలుస్తోన్న ప్రిన్స్ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆశిస్తూ… ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుదాం.