Mahesh Babbu Sitara-తన కొత్త సినిమా కోసం మహేష్ బాబు ఫ్రెష్ లుక్ తో కనిపించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. లాంగ్ హెయిర్ అండ్ గడ్డంతో కనిపించబోతున్న మహేష్ ఎలా ఉండబోతున్నాడు? అనే ఆసక్తి, ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. అలాంటి వారిని టీజ్ చేసేందుకు ప్రిన్స్ సతీమణి నమ్రత తాజాగా ఓ ఫోటోను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు.

మహేష్ బాబు బ్యాక్ యాంగిల్ లో ఉన్న ఈ ఫోటోలో ప్రిన్స్ గడ్డంతో ఉన్నారన్న విషయం స్పష్టమవుతోంది. స్పెయిన్ లో తీసిన ఈ షాట్ లో ప్రిన్స్ తనయురాలు సితార పక్కనే స్టెప్పులు వేసున్న వైనం కూడా చూడవచ్చు. 20 ఏళ్ళ ప్రిన్స్ కెరీర్ లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా గడ్డంతో కనిపించిన దాఖలాలు లేకపోవడంతో, ఈ లుక్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉంటే తెలంగాణాలో మహేష్ బాబు దత్తత తీసుకున్న సిద్దాపురం గ్రామాభివృద్ధికి సంబంధించిన అప్ డేట్స్ ను కూడా నమ్రత పోస్ట్ చేసారు. సోలార్ లైట్స్, బస్ షెల్టర్, వెటర్నరీ హాస్పిటల్ కు భూమి పూజ జరిగాయని, అలాగే వైద్య కేంద్రం నిర్మాణం శరవేగంగా జరుగుతోందని చెప్తూ…. అందుకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసారు.