When-Mahesh-Babu-Gushed-Over-A-Director-Like-A-Fanవిజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వం వహించిన “సర్కార్” సినిమా విడుదలై, ప్రేక్షకుల నుండి భిన్న స్పందనలు తెచ్చుకున్న విషయం తెలిసిందే. తమిళనాట మొదటి రోజు ఆల్ టైం రికార్డ్ వసూళ్లు సాధించిన ఈ సినిమా, తెలుగులో కూడా విజయ్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్లను అందుకున్న సినిమాగా నిలిచింది.

అయితే ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ కాని ఈ సినిమాపై టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ట్వీట్ చేసారు. “పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ‘సర్కార్’ సినిమాను ఆద్యంతం ఎంజాయ్ చేసానని, మురుగదాస్ ట్రేడ్ మార్క్ సినిమాగా అభివర్ణిస్తూ, చిత్ర యూనిట్ మొత్తానికి అభినందనలు’ తెలిపారు మహేష్.

“స్పైడర్” సినిమా ఫలితం తర్వాత మురుగదాస్ – మహేష్ ల మధ్య ఉన్న సత్సంబంధాలు దూరం అయ్యాయని గతంలో హల్చల్ చేసిన విషయం, ఈ ట్వీట్ తో తొలగిపోయినట్లయ్యింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా, మురుగదాస్ తో చేయాలన్న తన కల నెరవేరిందని, ‘స్పైడర్’ సినిమా చేసినందుకు తనకేం బాధ లేదని ప్రిన్స్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.