Mahesh- Babuప్రిన్స్ మహేష్ బాబు కొత్త సినిమా టైటిల్ గురించి ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు నాలుగు అక్షరాలను బయట పెట్టడంతో, దాదాపుగా “రిషి” అన్న టైటిల్ ఖరారైపోయినట్లుగా భావిస్తున్నారు. అయితే ఇందులో అతిపెద్ద ట్విస్ట్ లేకపోలేదు అన్నది లేటెస్ట్ న్యూస్.

అవును… రోజుకో లెటర్ ను రిలీజ్ చేస్తోన్న చిత్ర యూనిట్, ఇంకా ప్రిన్స్ పుట్టినరోజుకు మూడు రోజుల వ్యవధి ఉంది కాబట్టి, టైటిల్ లో మూడు అక్షరాలు రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం హల్చల్ చేస్తోన్న “రిషి” ప్రకారం అయితే కేవలం ఒక్క అక్షరం మాత్రమే మిగిలి ఉంటుంది. ఇక్కడే సూపర్ స్టార్ కృష్ణ అభిమానులకు మాంచి షాక్ ఇచ్చే ట్విస్ట్ రెడీ అవుతోందని టాక్.

ఇంకా మూడు రోజులు ఉంది కాబట్టి, ఇప్పుడు రిలీజ్ అయిన RISH లో మూడు అక్షరాలను కలిపితే, అంటే ముందుగా K”RISH”NA అన్న పేరు వస్తుంది. లాజిక్ ప్రకారం అయితే “కృష్ణ” అన్న టైటిల్ ఫైనల్ కావాల్సి ఉంది. అదే జరిగితే సూపర్ స్టార్ 25వ సినిమాకు పర్ ఫెక్ట్ ట్రీట్ ఇచ్చినట్లు అవుతుందని ఫ్యాన్స్ ఇప్పటినుండే పండగ చేసుకుంటున్నారు.