ధోని రెస్టు అడిగాడా? రెస్టు ఇచ్చారా?

Mahendra Singh Dhoniవచ్చే నెల నుంచి ప్రారంభంకానున్న వెస్టిండీస్‌ టూర్‌కు టీమిండియా జట్లను బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఆదివారం ప్రకటించింది. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలో జరిగిన సెలక్షన్‌ కమిటీ సమావేశానికి కెప్టెన్‌ కోహ్లీతో సహా పలువురు బీసీసీఐ అధికారులు హాజరయ్యారు. ఆగస్టు 3వ తేదీ నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలతో పాటు రెండు టెస్టులను టీమిండియా ఆడనుంది. ఇక వికెట్‌కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ఈ సిరీస్ లో పాల్గొనడం లేదు. అయితే ప్రపంచ కప్ లో పేలవప్రదర్శన మూలంగా ధోనిని పక్కన పెట్టి యువకులకు అవకాశం ఇస్తున్నారా అనే అనుమానాలు లేకపోలేదు. ధోని లేని కారణంగా రిషభ్‌ పంత్‌కు అవకాశం దక్కింది. టెస్టులలో మాత్రం పంత్ తో పాటు మరో విక్కెట్ కీపర్ వృద్ధిమాన్‌ సాహా ను కూడా జట్టులోకి తీసుకున్నారు.

మూడు ఫార్మాట్ల టీమిండియా జట్లు:

టీ20 జట్టు: విరాట్‌కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌శర్మ (వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌అయ్యర్‌, మనీశ్‌పాండే, రిషభ్ పంత్‌(వికెట్‌కీపర్‌), కృనాల్‌ పాండ్య, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, రాహుల్‌ చాహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌అహ్మద్‌, దీపక్‌ చాహర్‌, నవదీప్‌సైనీ.

వన్డే జట్టు: విరాట్‌కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌శర్మ (వైస్‌కెప్టెన్‌), శిఖర్‌ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌పాండే, రిషభ్‌పంత్‌(వికెట్‌కీపర్‌), రవీంద్రజడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌, కేదార్‌ జాదవ్‌, మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌కుమార్‌, ఖలీల్‌అహ్మద్‌, నవదీప్‌సైనీ.

టెస్టు జట్టు: విరాట్‌కోహ్లీ (కెప్టెన్‌), అజింక్యా రహానే (వైస్‌కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, ఛటేశ్వర్‌ పుజారా, హనుమ విహారి, రోహిత్‌శర్మ, రిషభ్‌పంత్‌(వికెట్‌కీపర్‌), వృద్ధిమాన్‌ సాహా(వికెట్‌కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, ఇషాంత్‌శర్మ, మహ్మద్‌ షమి, జస్ప్రిత్‌ బుమ్రా, ఉమేశ్‌ యాదవ్‌

Follow @mirchi9 for more User Comments
Don't MissOne Coronavirus Vaccine Showing Good Results - Details Here:A potential vaccine for Coronavirus has been developed and tested successfully in mice and there...YS - Jagan - Ramoji RaoDon't MissRamoji Rao's Donations Brings Questions on JaganMedia Baron and Eenadu Group Chairman, Ramoji Rao had announced a donation of 10 Crore...Corona Virus Deaths in US Cross That of 9/11 TollDon't MissCorona Virus Deaths in US Cross That of 9/11 TollThe United States has become the Epicenter of Coronavirus infections across the globe. The country...Deva Katta controversial comments on coronavirus donationsDon't Missవిరాళం ఇవ్వమని ఇండస్ట్రీ లో డిమాండ్ చేస్తున్నారా?కరోనా విపత్తు సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు, పస్తులు ఉంటున్న సినీ కార్మికులకు విరివిగా విరాళాలు ప్రకటించి ఆదర్శప్రాయంగా నిలించారు. తెలుగు...Around 1100 From Andhra Pradesh and Telangana Visits the Epicenter of Corona Cases in India?Don't MissAround 1100 From AP and TS Visits the Epicenter of Corona Cases in India?Over 8000 people from across India and countries like Indonesia, Malaysia, Kyrgyzstan, Bangladesh, etc. attended...
Mirchi9