Maharshi Teaserప్రిన్స్ మహేష్ బాబు “మహర్షి” సినిమా నుండి ఫస్ట్ లుక్ తో పాటు ఫస్ట్ టీజర్ ను కూడా విడుదల చేయగా, ‘ఈ సినిమాలో తన పాత్ర పేరేమిటో గెస్ చేయండి’ అంటూ హీరోయిన్ పూజా హెగ్డే అభిమానులను టీజ్ చేస్తూ ఓ పజిల్ విసిరింది. ఇందుకు రిప్లై ఇచ్చిన దేవి, ‘నన్ను ప్రకటించమంటారా?’ అంటూ ట్వీట్ చేసారు.

అయితే ఈ రోజున చాలా రివీల్ చేసాం గనుక, దానిని మరొక రోజుకు దాచిపెట్టండి అంటూ దర్శకుడు వంశీ పైడిపల్లి విజ్ఞప్తి చేసారు. దీనికి దేవి ‘కూల్ బడ్డీ’ అంటూ రిప్లై ఇచ్చిన దేవి, మీ డ్రీం ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ కు వచ్చిన స్పందనకు శుభాకాంక్షలు తెలిపాడు. ఇంతకీ ట్విస్ట్ ఏమిటంటే…. పూజా పేరు ‘మహా’, మహేష్ పేరు రిషి, ఇద్దరూ కలిస్తేనే “మహర్షి” అంటూ ఫ్యాన్స్ రిప్లైలు మీద రిప్లైలు ఇస్తున్నారు.