Maharshi Shooting on Location Stills -ప్రిన్స్ మహేష్ బాబు కెరీర్ లో 25వ సినిమాగా ప్రతిష్టాత్మకంగా మారిన “మహర్షి” సినిమా మలి షెడ్యూల్ ఈ నెల 11వ తేదీ నుండి ప్రారంభం కానుంది. నిర్విరామంగా 25 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్ లో దాదాపుగా టాకీ పార్టును పూర్తి చేసే విధంగా ప్లాన్ చేసారు. ఇందుకోసం ప్రత్యేకంగా రామోజీ ఫిలిం సిటీ ఓ విలేజ్ సెట్ ను కూడా తయారుచేసారు.

దీనికి సంబంధించిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పెంకుటిల్లు, పూరిళ్ళతో కూడిన ఈ సెట్స్ అచ్చమైన పల్లెటూరు మాదిరి కనిపిస్తుండడం విశేషం. ఇందుకు సంబంధించిన వర్క్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

Maharshi Shooting on Location Stills -

Maharshi Shooting on Location Stills -

Maharshi Shooting on Location Stills -